నేచురల్ స్టార్ నాని- డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్ లో ది ప్యారడైజ్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. గత వారమే ఈసినిమా షూటింగ్ స్టార్ట్ అవ్వగా చైల్డ్ హుడ్ సన్నివేశాలు చిత్రీకరించారు.ఇక ఈరోజు నాని కూడా షూట్ లో జాయిన్ అయ్యాడు. హైదరాబాద్ శివార్లలో స్పెషల్ గా వేసిన సెట్ లో ఈసినిమా షూటింగ్ జరుగుతుంది. ఇప్పటివరకు ఎవరు టచ్ చేయని పాయింట్ తో ఈసినిమా రానుంది.నాని ఇందులో సరికొత్త గెటప్ లో కనిపించనున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
అనిరుధ్ ఈసినిమాకు సంగీతం అందిస్తుండగా సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు.వచ్చే ఏడాది మార్చి 26న థియేటర్లలోకి రానుంది.పాన్ ఇండియా రిలీజ్ తోపాటు ఇంగ్లీష్ ,స్పానిష్ ల లో కూడా విడుదలకానుంది.ఇక గతంలో నాని -శ్రీకాంత్ ఓదెల కాంబోలో దసరా రాగ బ్లాక్ బస్టర్ అనిపించుకుంది. ఈసినిమాతో నాని మొదటి సారి 100 కోట్ల క్లబ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు.ఇక ఇప్పుడు ఈ కాంబినేషన్ మరోసారి రిపీట అవుతుండడంతో ది ప్యారడైజ్ పై భారీ అంచనాలు వున్నాయి.
ఇక నాని రీసెంట్ గా హిట్ 3 తో వచ్చి మరో విజయాన్ని ఖాతాలో వేసుకున్నాడు. మోస్ట్ వైలెంట్ గా మూవీ గా వచ్చిన ఈసినిమా 100 కోట్లపైనే వసూళ్లను రాబట్టుకుంది. నానికి ఇది వరుసగా నాలుగో విజయం.అంతేకాదు నిర్మాత గా కూడా రీసెంట్ గా నాని, కోర్టు తో భారీ విజయాన్ని అందుకున్నాడు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























