గత శుక్రవారం థియేటర్లలోకి వచ్చిన కుబేర సూపర్ రన్ ను కొనసాగిస్తోంది. వీకెండ్ లోనే కాకుండా వర్కింగ్ డేస్ లోకూడా స్ట్రాంగ్ హోల్డ్ కొనసాగిస్తూ బాక్సాఫీస్ వద్ద మొదటి స్థానంలో కొనసాగుతుంది. కేవలం 5 రోజుల్లోనే ఈసినిమా ప్రపంచ వ్యాప్తంగా 100కోట్లకుపైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది.దాంతో 70శాతం బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను పూర్తి చేసింది.ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఈసినిమా సూపర్ వసూళ్లను రాబట్టుకుంటుంది.నిన్నటి వరకు 45కోట్ల పైనే వసూళ్లను రాబట్టింది.అయితే తమిళంలో అనుకున్నంతగా ఫర్ఫార్మ్ చేయలేకపోతోంది. 5 రోజుల్లో అక్కడ 16కోట్ల గ్రాస్ వసూళ్లను మాత్రమే రాబట్టుకోగలిగింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక అటు ఓవర్సీస్ లో మాత్రం కూడా కుబేర అదరగొడుతుంది.నార్త్ అమెరికాలో ఇప్పటివరకు 1.9 మిలియన్ డాలర్ల వసూళ్లను రాబట్టుకుంది. రేపటి తో 2 మిలియన్ మార్క్ ను చేరుకోనుంది.ధనుష్ అలాగే నాగార్జున కు ఇదే మొదటి 2 మిలియన్ డాలర్ సినిమా కానుంది.ఇక ఈసినిమా తెలుగు రాష్ట్రాల్లో సార్ లైఫ్ టైం కలెక్షన్స్ ను క్రాస్ చేసింది.అంతేకాదు సూపర్ స్టార్ రజినీకాంత్ తరువాత తెలుగులో అత్యధిక వసూళ్లను రాబట్టిన హీరోగా ధనుష్ రికార్డు సృష్టించాడు .
ఇంతకుముందు సార్ తో టాలీవుడ్ లోకి బ్లాక్ బస్టర్ ఎంట్రీ ఇవ్వగా ఇప్పుడు కుబేర తో మార్కెట్ ను మరింతగా పెంచుకున్నాడు ధనుష్. అయితే కుబేరకు ఈ శుక్రవారం నుండి కన్నప్ప రూపంలో పోటీ ఎదురుకానుంది. మరి ఈ పోటీని తట్టుకొని కుబేర ఫుల్ రన్ లో ఎంతవరకు రాబట్టుకుంటుందో చూడాలి.శేఖర్ కమ్ముల తెరకెక్కించిన ఈసినిమాలో ధనుష్ తోపాటు కింగ్ నాగార్జున రష్మిక మందన్న ప్రధాన పాత్రల్లో నటించగా రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు.సునీల్ నారంగ్ , పుస్కూర్ రామ్ మోహన్ నిర్మించారు.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























