తమ మాతృమూర్తి అంజనాదేవి ఆరోగ్యం బాగుందని తెలిపారు ప్రముఖ నటుడు, మెగా బ్రదర్, ఏపీ ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా ‘అమ్మ ఆరోగ్యం చాలా బాగుంది’ అని స్పష్టం చేశారు. కాగా అంజనాదేవి అస్వస్థతకు గురయ్యారని ఈ ఉదయం నుంచీ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక మరోవైపు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈరోజు ఒక సమావేశం నుంచి మధ్యలో హడావుడిగా వెళ్లిపోయారని కూడా వార్తలు వచ్చాయి. దీంతో నిజంగానే వారి అమ్మగారి ఆరోగ్యం బాగాలేదేమోనని మెగాభిమానులు కూడా భావించారు. ఈ నేపథ్యంలోనే పవన్ సోదరుడు నాగబాబు దీనిపై స్పందించారు.
అయితే గతంలో కూడా ఒకసారి ఇలాగే అంజనాదేవి ఆరోగ్యంపై వదంతులు వ్యాపించాయి. దీంతో మెగాస్టార్ చిరంజీవి వీటిని ఖండిస్తూ ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. ఆమె ఆరోగ్యంపై ఎలాంటి ఊహాజనిత నివేదికలను ప్రచురించవద్దని అన్ని మీడియాలకు విజ్ఞప్తి. అర్ధం చేసుకుంటున్నందుకు ధన్యవాదాలు.” అని అందులో పేర్కొన్నారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























