కోలీవుడ్ సూపర్ స్టార్ ధనుష్, టాలీవుడ్ కింగ్ నాగార్జున, నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రధానపాత్రల్లో నటించిన లేటెస్ట్ హైలీ యాంటిసిపేటెడ్ పాన్-ఇండియా మూవీ ‘కుబేర’. సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఈ సినిమాని శేఖర్ కమ్ముల అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌తో కలిసి SVCLLPపై సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు హై బడ్జెట్ హై ప్రొడక్షన్ వాల్యూస్‌తో నిర్మిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా కుబేర తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషలలో జూన్ 20న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ తాజాగా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. చాలా గ్రాండ్‌గా జరిగిన ఈ వేడుకకు దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి చీఫ్ గెస్ట్‌గా హాజరై ‘కుబేర’ ట్రైలర్‌ని లాంచ్ చేశారు. ఈ సందర్భంగా రాజమౌళి కుబేర సినిమా కంటెంట్ మరియు దర్శకుడు శేఖర్ కమ్ములపై ప్రశంసలు కురిపించారు.
ఈ సందర్భంగా కింగ్ నాగార్జున మాట్లాడుతూ.. “అందరికి నమస్కారం. ఈ వేడుకకు వచ్చిన అభిమానులందరికీ థాంక్యూ. ధనుష్ తో కలసి వర్క్ చేయడం ఒక హానర్ గా భావిస్తున్నాను. తను ఒక క్యారెక్టర్ లో పెర్ఫార్మ్ చేసే విధానం అవుట్ స్టాండింగ్. తనకి మరిన్ని విజయాలు రావాలి. తనతో వర్క్ చేయడం చాలా ఆనందాన్ని ఇచ్చింది. కుబేర గురించి మాట్లాడాలంటే నాకు శేఖర్ కమ్ముల గారు గుర్తుకొస్తారు. ఇది కేవలం శేఖర్ కమ్ముల ఫిలిం. మేమందరం ఇందులో పాత్రలు మాత్రమే.”
“ఆయన కంఫర్ట్ జోన్ నుంచి బయటికి వచ్చి తీసిన సినిమా. మమ్మల్ని కూడా కంఫర్ట్ జోన్ నుంచి బయటకు తీసుకొచ్చాడు. ‘మాయాబజార్’ చూసినప్పుడు అది కె.వి రెడ్డి ఫిల్మ్ అంటాం. అలాగే కుబేర కూడా శేఖర్ కమ్ముల ఫిలిం. శేఖర్ కమ్ముల కోసమే ఈ సినిమా చేయడం జరిగింది. ఈ సినిమా హిట్ అవుతుందని శేఖర్ కాన్ఫిడెంట్ గా చెప్తుంటే చాలా ధైర్యంగా అనిపిస్తుంది. శేఖర్ పై పూర్తి నమ్మకం. ఉంది.”
“దేవిశ్రీ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు. పాటలు వింటుంటే పూనకం వస్తుంది. బ్యాగ్రౌండ్ స్కోర్ అదరగొట్టేశాడు. నిర్మాతలు సునీల్ గారు రామ్ మోహన్ గారికి థాంక్ యూ. టీమ్ అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్. సినిమా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను. ఎన్ని సంవత్సరాలైనా అభిమానుల ప్రేమ చెక్కుచెదరకుండా ఉంది. ఎలాంటి పాత్రలు చేసినా మీరు ఒప్పుకుంటున్నారు. చూస్తున్నారు. అభినందిస్తున్నారు. మీరు ఉన్నంతవరకూ ఏఎన్ఆర్ లీవ్స్ ఆన్. ఐ లవ్ యూ టు ఆల్” అని అన్నారు.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























