నాగార్జునతో స్క్రీన్ షేర్ చేసుకోవడం మ్యాజికల్ ఎక్స్‌పీరియెన్స్‌

Hero Dhanush Praises King Nagarjuna at Kuberaa Pre-Release Event

కోలీవుడ్ సూపర్ స్టార్ ధనుష్, టాలీవుడ్ కింగ్ నాగార్జున, నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రధానపాత్రల్లో నటించిన లేటెస్ట్ హైలీ యాంటిసిపేటెడ్ పాన్-ఇండియా మూవీ ‘కుబేర’. సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఈ సినిమాని శేఖర్ కమ్ముల అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌తో కలిసి SVCLLPపై సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు హై బడ్జెట్ హై ప్రొడక్షన్ వాల్యూస్‌తో నిర్మిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా కుబేర తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషలలో జూన్ 20న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ తాజాగా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. చాలా గ్రాండ్‌గా జరిగిన ఈ వేడుకకు దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి చీఫ్ గెస్ట్‌గా హాజరై ‘కుబేర’ ట్రైలర్‌ని లాంచ్ చేశారు. ఈ సందర్భంగా రాజమౌళి కుబేర సినిమా కంటెంట్‌ మరియు దర్శకుడు శేఖర్ కమ్ములపై ప్రశంసలు కురిపించారు.

ఈ సందర్భంగా హీరో ధనుష్ మాట్లాడుతూ.. “ఓం నమశ్శివాయ. అందరికీ నమస్కారం. ఏవీ చూస్తున్నప్పుడు మా నాన్నగారు గుర్తుకొచ్చారు. మమ్మల్ని ప్రయోజకులను చేయడానికి ఎంతగానో కష్టపడ్డారు. ఈరోజు ఇక్కడ ఇక్కడ వుండటానికి కారణం ఆయన కష్టం. ఈ సందర్భంగా నాన్నకి కృతజ్ఞతలు. శేఖర్ గారు ఈ సినిమా కోసం చాలా హార్డ్ వర్క్ చేశారు. హెల్త్ ని కూడా లెక్క చేయకుండా కష్టపడ్డారు. ఆయన విషయంలో నేను చాలా కంగారు పడ్డాను.”

“ఇది నాకు 52వ తమిళ్ సినిమా, రెండవ తెలుగు సినిమా. శేఖర్ గారు ‘సార్’ సినిమాకి ముందే ఈ కథ నాకు చెప్పారు. నా రెండో సినిమా ఆయనతో చేయడం చాలా ఆనందం. కుబేరలో అద్భుతమైన క్యారెక్టర్ ఇచ్చినందుకు శేఖర్ గారికి ధన్యవాదాలు. నాగార్జున గారితో వర్క్ చేయడం ఫెంటాస్టిక్ ఎక్స్‌పీరియెన్స్‌. ఆయన్నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను. ఆయన సినిమాలు చూస్తూ పెరిగాను. ఆయనతో స్క్రీన్ షేర్ చేసుకోవడం మ్యాజికల్ ఎక్స్‌పీరియెన్స్‌.”

“రష్మిక మందన్న చాలా కష్టపడి ఈ స్థాయికి వచ్చింది. ఈ సినిమాలో తను చాలా హార్డ్ వర్క్ చేసింది. ప్రొడ్యూసర్స్ సునీల్ గారికి, రామ్మోహన్ గారికి థాంక్ యూ. వారు లేకపోతే ఈ సినిమా లేదు. నా కోసం పనిచేసిన టెక్నీషియన్స్ యాక్టర్స్ అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. కుబేర చాలా స్పెషల్ ఫిలిం. జూన్ 20 వస్తుంది. తప్పకుండా మీరందరూ ఎంజాయ్ చేస్తారని నమ్మకం ఉంది” అని అన్నారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.