గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ రేపు తన 65వ పుట్టినరోజును జరుపుకోబోతున్నారు. ఈ సందర్భంగా తన తదుపరి చిత్రానికి సంబంధించి ఆయన బర్త్‌డే కానుకగా అభిమానులకు క్రేజీ అప్‌డేట్ వచ్చింది. బాలయ్య ప్రస్తుతం బోయపాటి దర్శకత్వంలో ‘అఖండ 2’ చేస్తుండగా.. తాజాగా మరో సినిమాను లైన్‌లో పెట్టేశారు. దీనికోసం ఆయన ట్యాలెంటెడ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేనితో మరోసారి చేతులు కలిపారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
#NBK111 అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకట సతీశ్ కిలారు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్నారు. ఇక ఈ ప్రాజెక్ట్ అనౌన్స్‌మెంట్ సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్‌లో క్రూరంగా చూస్తున్న సింహం కనిపిస్తోంది. ఇది బాలయ్యని రిఫర్ చేస్తున్నట్టుగా మేకర్స్ క్రియేట్ చేశారు.
కాగా బాలకృష్ణ – గోపీచంద్ మలినేని కాంబోలో గతంలో వచ్చిన ‘వీరసింహరెడ్డి’ బ్లాక్ బస్టర్ హిట్ అనిపించుకుంది. ఈ నేపథ్యంలో మరోసారి ఈ క్రేజీ కాంబో రిపీట్ కానుండటం విశేషం. ఈ సందర్భంగా డైరెక్టర్ గోపీచంద్ ఎక్స్ వేదికగా.. “గాడ్ ఆఫ్ మాసెస్ ఈజ్ బ్యాక్.. ఈసారి మా గర్జన మరింత గట్టిగా ఉండనుంది. బాలకృష్ణతో కలిసి మరోసారి వర్క్ చేస్తున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది. ఇది చరిత్రలో నిలిచిపోయే చిత్రం కానుంది’’ అని పేర్కొన్నారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: