నందమూరి బాలకృష్ణ నటించిన బ్లాక్ బస్టర్ మూవీ లక్ష్మీ నరసింహా మరోసారి థియేటర్స్ లోకి రానుంది. ఈనెల 10న బాలకృష్ణ బర్త్ డే కావడంతో ఈసినిమా ను రీరిలీజ్ చేస్తున్నారు.జయంత్ సి.పరాన్జీ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ నిర్మించిన ఈ చిత్రం 2004లో విడుదలైన ఘన విజయాన్ని అందుకుంది.ఈ చిత్రాన్ని 4K వెర్షన్లో జూన్ 8న థియేటర్స్ లో వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రీ రిలీజ్ చేస్తున్నారు. రీరిలీజ్ వెర్షన్ లో కొత్త సాంగ్ యాడ్ చేశారు. మందేసినోడు అంటూ సాగే పాటని భీమ్స్ సిసిరోలియో కంపోజ్ చేశారు. స్వరాగ్ కీర్తన్ హై ఎనర్జీతో పాడిన ఈ సాంగ్ కి ఆస్కార్ విన్నర్ చంద్రబోస్ మాస్ ని కట్టిపడేసే లిరిక్స్ అందించారు. రీరిలీజ్ ప్రెస్ మీట్ లో ఈ సాంగ్ ని గ్రాండ్ గా లాంచ్ చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ సందర్భంగా నిర్మాత బెల్లంకొండ సురేష్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ఈ సినిమా రీరిలీజ్ ని లైఫ్ లో మర్చిపోలేను.21 ఏళ్ల తర్వాత ‘లక్ష్మీ నరసింహా’ సినిమాని రీరిలీజ్ చేస్తున్నానంటే నందమూరి అభిమానులకు ఏదో ఒక స్పెషల్, సర్ప్రైజ్ ఇవ్వాలి.ఎలాంటి సర్ ప్రైజ్ అని ఆలోచన వచ్చినప్పుడు.. ఈ సినిమా కోసం రెండు సాంగ్స్ చేశాం.ఒక సాంగ్ ని షూట్ చేసాంగాని సినిమాలో లేదు. ఆ సాంగ్ ని ఎలాగైనా రి రిలీజ్ లో యాడ్ చేయాలి అని ఆలోచన వచ్చింది.ప్రసాద్ ల్యాబ్స్ లో నెగిటివ్ దొరికింది.కానీ సౌండ్ దొరకలేదు సౌండ్ లేదు. ఓన్లీ పిక్చర్ ఉంది.పిక్చర్ ప్రింట్ చేసి ఫస్ట్ చంద్రబోస్ గారికి, తర్వాత డైరెక్టర్ గారికి, బీమ్స్ కి పంపించాను.వాయిస్, లిరిక్ రాసి రికార్డు చేయాలని చెప్పాను. బోస్ గారు ఇది ఎలా పాజిబుల్ అన్నారు. చేస్తేనే పాజిబుల్ అవుతుందని చెప్పాను. ఒకసారి ప్రయత్నించమని చెప్పాను.
అయితే ఈ ప్రయత్నాన్ని అద్భుతంగా చేశారు.ఈ పాటని డిస్ట్రిబ్యూటర్స్ కి వినిపిస్తే పాట అద్భుతంగా ఉంది కొత్త సినిమాల్లో పెట్టండి బ్లాక్ బస్టర్ అవుతుంది అని చెప్పారు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.నందమూరి అభిమానులు ఈ సినిమాని ఈ సినిమాని మళ్లీ మళ్లీ పెద్ద హిట్ చేయాలని కోరుతున్నాను. బాలయ్య బాబు బర్త్ డే కి వస్తుంది.ఇందులో కొత్త సాంగ్ ఉంది. 4k లో చాలా కష్టపడి మౌనిక రెడ్డి, అభిలాష్ రెడ్డి గారు, వంశీ ఈ సినిమాని రెడీ చేశారు.నేనప్పుడు తీసిన దాని కంటే ఇప్పుడు స్క్రీన్ మీద బ్రహ్మాండంగా కనిపిస్తుంది. జయంతి అప్పుడు ఇప్పుడు ఒకేలా వున్నారు. మంచి కథ ఉంటే మళ్లీ సినిమా చేద్దామని చెప్పాను. రీ రిలీజ్ కు ఇంత అద్భుతమైన సాంగ్ ఇచ్చిన భీమ్స్ గారికి, చంద్రబోస్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. అందరికీ థాంక్ యూ అన్నారు.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్



మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























