ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పొలిటికల్ బిజీ వల్ల వాయిదా పడ్డ సినిమాలను పూర్తి చేసే పనిలో వున్నాడు. అందులో భాగంగా రీసెంట్ గా హరి హర వీరమల్లు పార్ట్ 1ను కంప్లీట్ చేశాడు.ఈసినిమా ఈనెల 12న రిలీజ్ కానుంది.ఇక పవన్ ప్రస్తుతం యంగ్ డైరెక్టర్ సుజీత్ తెరకెక్కిస్తున్న ఓజీ షూటింగ్ లో పాల్గొంటున్నాడు.ప్రస్తుతం ముంబైలో షూటింగ్ జరుపుకుంటుంది.వచ్చే నెల ఫస్ట్ వీక్ లో ఈషెడ్యూల్ కంప్లీట్ కానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ షూటింగ్ తో దాదాపు సినిమా కంప్లీట్ అయినట్లే.గ్యాంగ్ స్టార్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈసినిమాలో ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తుండగా ఇమ్రాన్ హష్మీ విలన్ పాత్రలో కనిపించనున్నాడు.తమన్ సంగీతం అందిస్తున్నాడు.డివివి దానయ్య ఈసినిమాను నిర్మిస్తున్నాడు.సెప్టెంబర్ 25న రిలీజ్ చేయనున్నారు.
ఇక పవన్ కళ్యాణ్ , ఉస్తాద్ భగత్ సింగ్ కి కూడా డేట్స్ ఇచ్చినట్లు సమాచారం.అన్ని కుదిరితే జూన్ 10నుండి ఈసినిమా షూటింగ్ తిరిగి స్టార్ట్ కానుందట.హరీష్ శంకర్ ఈసినిమాను తెరకెక్కిస్తుండగా శ్రీ లీల ఓ హీరోయిన్ గా నటిస్తుంది.ఇప్పటివరకు 20శాతం షూటింగ్ కంప్లీట్ చేసుకుంది.ఇక పవన్ డేట్స్ ఇవ్వడంతో వీలైనంత తొందరగా షూటింగ్ కంప్లీట్ చేయాలని చూస్తున్నారు.రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈసినిమాకు సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుంది.వచ్చే ఏడాది సమ్మర్ లో రిలీజ్ అయ్యే ఛాన్స్ వుంది.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:


























