యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ హీరోగా, లెజెండరీ దర్శకుడు మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ హై-యాక్షన్ గ్యాంగ్‌స్టర్ డ్రామా ‘థగ్ లైఫ్’. ఈ భారీ చిత్రం జూన్ 5న థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. త్రిష, శింబు కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలై ప్రమోషనల్ కంటెంట్ నేషనల్ వైడ్ గా సెన్సేషన క్రియేట్ చేసింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
హీరో నితిన్ ఫాదర్ ఎన్ సుధాకర్ రెడ్డి శ్రేష్ఠ్ మూవీస్ ద్వారా ఈ సినిమా తెలుగులో విడుదల కానుంది. ఈ సందర్భంగా చెన్నైలో భారీ ఆడియో లాంచ్ ఈవెంట్ వేడుకను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో లోక నాయకుడు కమల్ హాసన్, అభిరామి, నాజర్, అశోక్ సెల్వన్, సినిమాటోగ్రాఫర్ రవి.కె.చంద్రన్ సహా పలువురు నటీనటులు, టెక్నీషియన్స్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కన్నడ సూపర్‌స్టార్ శివ రాజ్‌కుమార్ మాట్లాడుతూ.. ‘‘అభిమానులు ఎలాగైతే ఫ్యాన్ మూమెంట్‌ను ఎంజాయ్ చేస్తున్నారో.. నేను కూడా ఇప్పుడు ఫ్యాన్ మూమెంట్‌ను ఎంజాయ్ చేస్తున్నాను. కమల్ హాసన్ గారికి నేను చాలా పెద్ద ఫ్యాన్‌ని. ఆయనంటే అంత ప్రాణం నాకు. ఆయన సినిమాలన్నీ తొలి రోజున తొలి షో చూస్తుంటాను. అలాగే మణిరత్నం గారికి, ఎ.ఆర్.రెహమాన్ గారికి, శింబు గారికి, త్రిష గారికి అభిరామి గారికి థాంక్స్. రాజ్‌కమల్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ బ్యానర్లో తొలి సినిమా ఓపెనింగ్‌కు క్లాప్‌ను నాన్నగారే కొట్టి ప్రారంభించారు. ఆ ప్రయాణాన్ని నేను మరచిపోలేను. ఎంటైర్ టీమ్‌కు ఆల్ ది బెస్ట్’’ అని అన్నారు.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























