యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ హీరోగా, లెజెండరీ దర్శకుడు మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ హై-యాక్షన్ గ్యాంగ్‌స్టర్ డ్రామా ‘థగ్ లైఫ్’. ఈ భారీ చిత్రం జూన్ 5న థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. త్రిష, శింబు కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలై ప్రమోషనల్ కంటెంట్ నేషనల్ వైడ్ గా సెన్సేషన క్రియేట్ చేసింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
హీరో నితిన్ ఫాదర్ ఎన్ సుధాకర్ రెడ్డి శ్రేష్ఠ్ మూవీస్ ద్వారా ఈ సినిమా తెలుగులో విడుదల కానుంది. ఈ సందర్భంగా చెన్నైలో భారీ ఆడియో లాంచ్ ఈవెంట్ వేడుకను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో లోక నాయకుడు కమల్ హాసన్, అభిరామి, నాజర్, అశోక్ సెల్వన్, సినిమాటోగ్రాఫర్ రవి.కె.చంద్రన్ సహా పలువురు నటీనటులు, టెక్నీషియన్స్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా హీరోయిన్ త్రిష మాట్లాడుతూ.. ‘‘థగ్ లైఫ్ పాటలను ముందుగానే వినే అవకాశం వచ్చింది. 37 ఏళ్లుగా కమల్ సర్..మణి సర్ ఎప్పుడు కలిసి పని చేస్తారోనని అభిమానిగా ఎదురు చూశాను. మణిరత్నం గారితో నాలుగు సినిమాలు చేశాను. నాలుగు మూవీస్ కమల్ హాసన్ గారితో వర్క్ చేశాను. అలాగే రెహమాన్‌గారి మ్యూజిక్ కంపోజ్‌లో సినిమా చేయటం గొప్ప ఎక్స్‌పీరియెన్స్. నటిగా వీటిని గర్వంగా చెప్పుకుంటాను. కలలు నిజమయ్యాయనిపిస్తుంది. కొన్ని సినిమాలు ఎంతో స్పెషల్‌గా అనిపిస్తాయి. అలాంటి సినిమానే థగ్ లైఫ్.” అని చెప్పారు.
ఇంకా ఆమె మాట్లాడుతూ.. “కమల్ గారు నేను స్టూడెంట్‌నేనని చెబుతుంటారు.. కానీ ఆయన్నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను. పొన్నియన్ సెల్వన్‌లో నేను చేసిన పాత్రకు పూర్తి భిన్నమైన పాత్రలో నటించాను. శింబుతో కలిసి ‘వినతాండి వరువాయ’ సినిమా తర్వాత కలిసి నటించాను. ట్రైలర్లో రెండు నిమిషాలు మాత్రమే చూశారు. రేపు థియేటర్లో సినిమా చూసేటప్పుడు రెండు గంటల తర్వాత అర్థమవుతుంది. అశోక్ సెల్వన్ గారికి, అభిరామి గారికి థాంక్స్. థగ్ లైఫ్ సినిమాలో వర్క్ చేయటాన్ని నటిగా గొప్పగా ఫీల్ అవుతుంటాను’’ అని అన్నారు.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























