టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్, తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్ (TFDC) చైర్మన్ దిల్ రాజు రెండు దశాబ్దాలకు పైగా అగ్ర నిర్మాతగా కొనసాగుతున్నారు. ఈ క్రమంలో ఆయన ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాలను పరిశ్రమకు అందించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ అనే బ్యానర్‌ను స్థాపించి ఎంతోమంది ఔత్సాహిక నటీనటులను, దర్శకులను మరియు టెక్నిషియన్లను ఇండస్ట్రీకి పరిచయం చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇటీవలే టెక్నాలజీని సినీ రంగంలోకి పరిచయం చేయాలనే దృఢ సంకల్పంతో క్వాంటం భాగస్వామ్యంతో ‘లోర్వెన్ AI’ అనే సరికొత్త స్టూడియోను హైదరాబాద్ కేంద్రంగా లాంచ్ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దిల్ రాజు తన కార్యకలాపాలను మరింతగా విస్తరించేందుకు సరికొత్త ప్రణాళికలతో ముందుకొస్తున్నారు. ఈ క్రమంలో కొత్త టాలెంట్‌ను ప్రోత్సహించేందుకు ‘దిల్ రాజు డ్రీమ్స్’ అనే కొత్త ప్లాట్ ఫామ్‌ను ప్రారంభిస్తున్నారు. దీనికి సంబంధించి ఇదివరకే దిల్ రాజు టీం లోగోను లాంచ్ చేసింది.
అయితే తాజాగా జూన్ నెల నుంచి ఆయన సిద్ధం చేసిన ఆన్ లైన్ ప్లాట్‌ఫామ్ యాక్టివ్ కానున్నట్టు తెలిపింది దిల్ రాజు బృందం. ఈ ప్లాట్‌ఫామ్‌లో భాగం కావాలనుకునే వారు https://dilrajudreams.com/ లింక్‌పై క్లిక్ చేసి తమ వివరాలను నమోదు చేస్తే, దిల్ రాజు డ్రీమ్స్ బృందం స్వయంగా వారిని సంప్రదిస్తుంది. జూన్‌లో ఈ పోర్టల్ సిద్ధమైన తర్వాత, దిల్ రాజు డ్రీమ్స్ ద్వారా యువ ప్రతిభావంతులు తమ ఆలోచనలను ఈ బృందం దృష్టికి తీసుకెళ్లవచ్చు.
తమ టాలెంట్ నిరూపించుకోవాలనుకునేవారు ఎంతోమంది సరైన ప్లాట్ఫామ్ లేక ఇబ్బంది పడుతున్నారు. టాలెంట్ ఉన్నా సినీ పరిశ్రమలో కాంటాక్ట్స్ లేక, ఎవరిని ఎలా అప్రోచ్ అవ్వాలో తెలియక ముందుకు వెళ్లలేకపోతున్నారు. అలాంటి వారందరికీ ఇది ఒక గోల్డెన్ ఛాన్స్. టాలెంట్ ఉన్నవారు దాన్ని ప్రూవ్ చేసుకోవడానికి దిల్ రాజు స్థాపించిందే ఈ దిల్ రాజు డ్రీమ్స్..
మరి ఇంకెందుకు ఆలస్యం? టాలెంట్ ఉండి, సినిమాలు చేయాలనే ఆలోచన ఉన్నవారు, సినీ పరిశ్రమలో అడుగు పెట్టాలనుకునేవారు, సినీ పరిశ్రమంలో భాగము కావాలనుకునేవారు దిల్ రాజు డ్రీమ్స్ లింక్ ద్వారా రిజిస్టర్ చేసుకుని తమ కలను సాకారం చేసుకునే అవకాశాన్ని పొందండి. తద్వారా తెలుగు చిత్ర పరిశ్రమలో మీ ఉనికిని ఘనంగా చాటండి.
దిల్ రాజు డ్రీమ్స్ గురించి ఇంతకుముందు దిల్ రాజు మీడియాతో పంచుకున్న ముఖ్య విషయాలివే..
- కొత్త వాళ్లను, కొత్త కంటెంట్‌ను ఎంకరేజ్ చేసేందుకు ఈ దిల్ రాజు డ్రీమ్స్‌ను ప్రారంభించాను. దర్శక, నిర్మాతలు, హీరో హీరోయిన్లు ఇలా ఎవ్వరైనా సరే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్లు, కంటెంట్ ఉన్న వాళ్లు దిల్ రాజు టీంను అప్రోచ్ అవ్వొచ్చు. ఈ మేరకు ఓ వెబ్ సైట్‌ను లాంచ్ చేయబోతోన్నాం. ఆ వెబ్ సైట్ ద్వారా మీ కంటెంట్ మా టీంకు చేరుతుంది. వారంలో ఒక రోజు నేను ఈ టీం తెచ్చిన స్క్రిప్ట్‌లను వింటాను.
- నా బర్త్ డే సందర్భంగా అయినా లేదా న్యూయర్ సందర్భంగా అయినా ఈ కొత్త వెబ్ సైట్‌ను లాంచ్ చేస్తాం. నాకు సన్నిహితులైన స్టార్ హీరోలను, దర్శకులందరినీ పిలిచి ఆ వెబ్ సైట్‌ను గ్రాండ్‌గా లాంచ్ చేస్తాం. దీనిపై త్వరలోనే అప్డేట్ ఇస్తాం.
- ఇప్పటికే ఇద్దరు ఎన్నారై నిర్మాతలు దిల్ రాజు డ్రీమ్స్ ద్వారా రెండు ప్రాజెక్టులను చేస్తున్నారు. కొత్త వాళ్లందరికీ ఇదొక ఫ్లాట్ ఫాంగా ఉండాలని అనుకుంటున్నాను.
- రివ్యూయర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మా స్క్రిప్టులను రివ్యూ చేయొచ్చు. స్క్రిప్ట్ స్థాయిలోనే మీడియా వాళ్ల సహాయం తీసుకోవాలని అనుకుంటున్నాం. సినిమాను ఎలాగూ రివ్యూ చేస్తారు. దాని కంటే ముందు ఇలా స్క్రిప్ట్‌ని కూడా రివ్యూ చేసేందుకు మా టీంలోకి మీడియాని ఆహ్వానిస్తున్నాం.
- ఇండస్ట్రీలో చాలా చిత్రాలు వస్తున్నట్టుగా, పోయినట్టుగా కూడా ఎవ్వరికీ తెలీదు. నా దగ్గరకు చాలా మంది వచ్చి పోస్టర్‌లు, టీజర్‌లు రిలీజ్ చేయమని అడుగుతారు. అవి చూడగానే నాకు అర్థం అవుతుంది. ఇలాంటి చిత్రాలు ఎందుకు తీస్తారు.. ఎవరు చూస్తారు? అని చెప్పేస్తాను. అక్కడ ఎంత డబ్బు వృథాగా పోతోందో నాకు తెలుస్తుంది. అందుకే ఈ డ్యామేజ్‌ను కంట్రోల్ చేయాలని, సరైన ఫ్లాట్ ఫాం ఉండాలని దిల్ రాజు డ్రీమ్స్‌ను స్థాపించాను.
- ఏడాదికి నాలుగైదు సినిమాలనే చేయాలని ఫిక్స్ అయ్యాం. మా టీం అన్ని కథలు, స్క్రిప్టులు విని వడపోస్తారు. అందులోంచి కేవలం ఐదు చిత్రాలను ఎంచుకుంటాం. కచ్చితంగా రెండు అయినా హిట్ కావాలనే కండీషన్ పెట్టాను. తీసే ఐదు చిత్రాలకు ఐదు చిత్రాలు ఫ్లాప్ అయితే మా కష్టం వృథా అవుతుంది.
- ఈ ప్రాసెస్‌లో న్యూ టాలెంట్ వస్తే.. మున్ముందు నా బ్యానర్‌లోనే సినిమా చేసే అవకాశం ఉంటుంది. అసలు టాలెంట్ ముందు తెరపైకి రావాలి. బలగం వేణు మాకు సినిమా చేశాడు. మాతో ఎమోషన్ ఏర్పడింది. ఇప్పుడు మళ్లీ ఎల్లమ్మ సినిమాను కూడా మాకే చేస్తున్నారు. అలా కొత్త టాలెంట్‌ను ఎంకరేజ్ చేస్తే నాక్కూడా హెల్ప్ అవుతుంది.
- ఇక్కడ ఎలాంటి రికమండేషన్స్ ఉండవు. అందరూ వెబ్ సైట్స్ ద్వారానే అప్రోచ్ అవ్వాలి. 20 నిమిషాల స్క్రిప్ట్‌ను అందులో పెట్టాల్సి ఉంటుంది. అది మా టీం చూస్తుంది. ఆ తరువాత వడపోత కార్యక్రమం తరువాత నా వద్దకు వస్తుంది. ఈ కొత్త కథలను వినేందుకు వారంలో ఒక రోజు ఇకపై తప్పకుండా కేటాయిస్తాను.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: