కింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ శ్రీ విష్ణు, ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ సమ్మర్ సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ #సింగిల్. కేతిక శర్మ, ఇవానా కథానాయికలుగా నటించారు, వెన్నెల కిషోర్ కీలక పాత్ర పోషించారు. ఈ చిత్రానికి కార్తీక్ రాజు దర్శకత్వం వహించారు. గీతా ఆర్ట్స్ మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో కళ్యా ఫిల్మ్స్‌తో కలిసి చిత్రాన్ని విద్యా కొప్పినీడి, భాను ప్రతాప, రియాజ్ చౌదరి నిర్మించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
మే 9న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా అందరినీ అలరించి సమ్మర్ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకొని సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ సక్సెస్ మీట్ లో మూవీ టీం అంతా పాల్గొన్నారు. ఇక ఈ సందర్భంగా హీరో శ్రీ విష్ణు ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు.
శ్రీ విష్ణు ఏమన్నారో ఆయన మాటల్లోనే.. “మూడేళ్ల క్రితం ఈ కథని డైరెక్టర్ కార్తీక్ రాజుగారు నాకు చెప్పడం జరిగింది. అంతకుముందు ఈ కథని ఒక 15 మంది రిజెక్ట్ చేశారు. వాళ్లందరికీ కూడా థాంక్యూ (నవ్వుతూ). సినిమాని చాలా కసిగా చేసాం. నా కసిలో పాలుపంచుకున్న వెన్నెల కిషోర్ గారికి థాంక్యూ (నవ్వుతూ) అరవింద్ గారు విద్య గారు రియాజ్ గారు భాను గారు సినిమా బిగినింగ్ నుంచి చాలా సపోర్ట్ చేశారు.”
“మంచి టీం తో చేస్తున్న ఈ సినిమా ఖచ్చితంగా సక్సెస్ కొడితే బావుంటుందని అనుకున్నాను అది జరిగింది. దేవుడు ఉన్నాడు. హానెస్ట్ గా సిన్సియర్ గా ఏది చేసినా దేవుడు మనకి ఇచ్చేస్తాడు. ఈ సినిమా విజయం, అరవింద్ గారితో జర్నీ చాలా ఎంజాయ్ చేశాను. ఇది విద్యా గారి కోసమైనా సక్సెస్ అయిపోవాలని బలంగా అనుకున్నాను. డైరెక్టర్ కార్తీక్ రాజు గారితో వర్క్ చేయడం చాలా వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్.”
“మా డైరెక్షన్ టీమ్ అందరికీ థాంక్యు. మా టీమ్ అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. చాలా సంవత్సరాల తర్వాత ఇంత మంచి ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ ఇచ్చిన ఆడియన్స్ కి చాలా థాంక్యూ ఈ సినిమాకి అద్భుతంగా సపోర్ట్ చేసిన మీడియా మిత్రులు అందరికీ థాంక్యు. కేతిక ఇవాళ ఆ క్యారెక్టర్స్ కి లైఫ్ తీసుకొచ్చారు. వాళ్ళు చాలా మంచి మంచి సినిమాలు చేసి ఇంకా పెద్దపెద్ద హిట్లు కొట్టాలని కోరుకుంటున్నాను.”
“ఈ సినిమాని జనం చూస్తూనే ఉంటారు. సినిమాని చాలా రోజులు ఎంజాయ్ చేస్తారు. ముందు చెప్పినట్లు కేవలం నవ్వుకోవడానికే తీసిన సినిమా ఇది. మీరంతా థియేటర్స్ కొచ్చి ఇంతలా నవ్వుకోవడం చాలా హ్యాపీగా ఉంది. ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ ఇచ్చిన ఆడియన్స్ కి మరోసారి హృదయపూర్వక కృతజ్ఞతలు” అని అన్నారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: