హరిహర వీరమల్లు.. ఫుల్ స్వింగ్‌లో డబ్బింగ్

Hari Hara Veera Mallu Dubbing Undergoes With Full Swing

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మచ్ అవైటెడ్ మూవీ ‘హరిహర వీరమల్లు పార్ట్-1: స్వార్డ్ వర్సెస్ స్పిరిట్’ జూన్ 12న విడుదలకు సిద్ధమవుతోంది. షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం రీ-రికార్డింగ్, డబ్బింగ్ మరియు VFX పనుల్లో బిజీగా ఉంది. ఇప్పటికే మూవీ ప్రమోషన్స్ మొదలుపెట్టేసిన మేకర్స్ రెండు పాటలు రిలీజ్ చేయగా, మంచి రెస్పాన్స్ దక్కించుకున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీకి సంబంధించి ఇంట్రెస్టింగ్ అప్డేట్ అందింది. హరిహర వీరమల్లు డబ్బింగ్ ఫుల్ స్వింగ్‌లో నడుస్తోంది. ఇప్పటికే ఈ మూవీని వీక్షించిన డబ్బింగ్ సిబ్బంది, సౌండ్ ఇంజనీర్స్ అద్భుతంగా ఉందని కితాబిచ్చారు ఈ మేరకు డైరెక్టర్ జ్యోతికృష్ణ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. దీంతో పవర్ స్టార్ అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.

ఇక ఈ మూవీలో ప్రముఖ బాలీవుడ్ నటుడు, యానిమల్ ఫేమ్ బాబీ డియోల్ ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తుండగా, నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తున్నారు. లెజెండరీ నటుడు అనుపమ్ ఖేర్, నాజర్, రఘుబాబు తదితరులు ఈ చిత్రంలో ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళం, మలయాళం, హిందీ మరియు కన్నడ భాషల్లో విడుదల కానుంది.

పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా రూపొందుతోన్న ఈ సినిమాకి యువ దర్శకుడు జ్యోతి కృష్ణ దర్శకత్వం వహిస్తుండగా.. ప్రముఖ నిర్మాత ఎ.ఎం. రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకంపై ఎ. దయాకర్ రావు అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. కాగా ఈ చిత్రానికి ఎం.ఎం. కీరవాణి సంగీతం సమకూరుస్తుండగా.. మనోజ్ పరమహంస కెమెరా, తోట తరణి ఆర్ట్ అందిస్తున్నారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.