ఎన్టీఆర్-నీల్ అప్‌డేట్ లేదు

Team NTR-Neel Announces, No Updates Reveals on NTR Birthday

మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ నటిస్తోన్న మచ్ అవైటెడ్ ఫిల్మ్ ‘ఎన్టీఆర్-నీల్’ (వర్కింగ్ టైటిల్). ‘కేజీఎఫ్’ సిరీస్ మరియు సలార్ చిత్రాలతో దేశవ్యాప్తంగా పాపులర్ అయిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నాడు. 1960ల నాటి కథతో తెరకెక్కుతోంది. కోల్‌కతా బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతోన్న ఈ చిత్రంపై చాలా అంచనాలున్నాయి. కొన్నిరోజుల క్రితం షూటింగ్ మొదలవగా, ఇప్పటికే రెండు షెడ్యూల్స్ పూర్తయ్యాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

రీసెంట్‌గా జరిగిన సెకండ్ షెడ్యూల్‌లో ఎన్టీఆర్ పాల్గొన్నాడు. ఇందులో ఆయనపై కొన్ని కీలకమైన యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించారు. అయితే ఈ సినిమాకి సంబంధించి ఇప్పటివరకూ పెద్దగా అప్‌డేట్స్ ఏమీ రాలేదు. వచ్చే ఏడాది జూన్ 25న థియేటర్లలోకి రానుందని మాత్రమే మేకర్స్ వెల్లడించారు. ఈ క్రమంలో తారక్ జన్మదినం సందర్భంగా మే 20న ఈ మూవీ నుంచి ఆయన ఫస్ట్ లుక్ పోస్టర్ రావొచ్చని అభిమానులు భావిస్తున్నారు.

అయితే తాజాగా దీనిపై చిత్ర యూనిట్ కీలక ప్రకటన చేసింది. ఎన్టీఆర్-నీల్ నుంచి ఎలాంటి అప్‌డేట్ ఇవ్వడం లేదని తెలిపింది. ఈసారి తారక్ బర్త్ డే గిఫ్ట్‌ను అందించే బాధ్యతను ‘వార్ 2’ చిత్రానికే వదిలిపెడుతున్నట్టు పేర్కొంది. మరో సందర్భంలో ఈ చిత్రం నుంచి ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ అందిస్తామని హామీ ఇచ్చింది. దీంతో ఎంతగానో ఎదురుచూస్తున్న జూనియర్ ఫ్యాన్స్ ఒకింత డిజప్పాయింట్ అయ్యారనే చెప్పొచ్చు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.