నార్త్ మార్కెట్ ను టార్గెట్ చేసిన అఖండ 2

Akhanda 2 is being made targeting Hindi audiences

బ్లాక్ బస్టర్ అఖండ కు సీక్వెల్ గా అఖండ 2 తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. బోయపాటి శ్రీనివాస్ డైరెక్షన్ లో బాలకృష్ణ హీరోగా నటిస్తున్న ఈసినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.అఖండ కేవలం తెలుగులోనే విడుదలై దాదాపు 70కోట్ల వసూళ్లను రాబట్టుకుంది. అయితే అఖండ 2 మాత్రం పాన్ ఇండియా రిలీజ్ కానుంది.డివోషనల్ టచ్ తో రీసెంట్ గా తెలుగు నుండి వచ్చిన సినిమాలు హిందీలో కూడా బాగా ఆడాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అందులో భాగంగా కార్తికేయ 2 ,హనుమాన్ అక్కడ సాలిడ్ వసూళ్లను సొంతం చేసుకున్నాయి. దాంతో అఖండ 2ను హిందీ ఆడియన్స్ కూడా నచ్చేలా తెరమీదకు తీసుకువస్తున్నారు మేకర్స్. హిట్ టాక్ వస్తే అఖండ 2 హిందీలో సోలోగా 100కోట్ల సినిమా అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు.

ఇక బోయపాటి శ్రీనివాస్ ,బాలకృష్ణ కాంబినేషన్ లో ఇంతకుముందు వచ్చిన మూడు సినిమాలు బ్లాక్ బస్టర్స్ అవ్వడంతో ఈ నాలుగో సినిమాగా వస్తున్న అఖండ 2 పై అంచనాలు భారీగా వున్నాయి. సంయుక్త మీనన్ కీలక పాత్రలో నటిస్తుండగా తమన్ ఈసినిమాకు సంగీతం అందిస్తున్నాడు. 14రీల్స్ ప్లస్ నిర్మిస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 25న థియేటర్లలోకి రానుంది.బాలకృష్ణ బర్త్ డే సందర్భంగా జూన్ 10న ఈసినిమా టీజర్ ను రిలీజ్ చేయాలని చూస్తున్నారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.