రికార్డు సృష్టించిన తుడరుమ్

Thudarum creates all time record at the kerala boxoffice

మలయాళం స్టార్ మోహన్ లాల్ తుడరుమ్ సరికొత్త రికార్డు సృష్టించింది.నిన్నటితో ఈసినిమా కేరళలో 90 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.దాంతో ఆల్ టైం హైయెస్ట్ గ్రాసర్ గా రికార్డుల్లోకెక్కింది. ఇంతకుముందు 2018 అక్కడ అత్యధిక వసూళ్లను రాబట్టిన సినిమాగా మొదటి స్థానంలో ఉండేది. ఇప్పుడు ఆ రికార్డును తుడరుమ్ బ్రేక్ చేసింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

రిలీజైన దగ్గరినుండి ఈసినిమా సూపర్  రన్ తో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది ఈసినిమా. నిన్నటి వరకు ప్రపంచ వ్యాప్తంగా 188 కోట్ల వసూళ్లను రాబట్టుకుంది.ఈరోజుతో 200కోట్ల క్లబ్ లో చేరనుంది.ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తరుణ్ మూర్తి తెరకెక్కించిన ఈసినిమాలో శోభన ,థామస్ మాథ్యూ, షైజో ఆదిమాలి కీలక పాత్రల్లో నటించగా జెక్స్ బిజోయ్ సంగీతం అందించాడు.ఈసినిమా తెలుగులో కూడా రిలీజ్ కాగా అనుకున్నంత రెస్పాన్స్ రాలేదు.

ఇక బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్ లతో మోహన్ లాల్ ప్రస్తుతం పీక్ ఫామ్ లో వున్నాడు.మార్చి చివర్లో ఎల్2: ఎంపురాన్ రిలీజ్ కాగా 250కోట్లకుపైగా వసూళ్లను రాబట్టి సెన్సేషన్ సృష్టించింది. ఇక ఇప్పుడు నెల గ్యాప్ లో తుడరుమ్ తో వచ్చి మోహన్ లాల్ మరోసారి 200 కోట్ల క్లబ్ లో చేరనున్నాడు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.