నటీనటులు: నవీన్ చంద్ర, రాశి సింగ్, రవివర్మ, అలీ రెజా, గాయత్రి భార్గవి, హారిక పెడదా, హర్ష రోషన్ తదితరులు
సంగీతం: శ్రీరామ్ మద్దూరి
సినిమాటోగ్రఫీ: దర్శన్ అంబట్
ఎడిటింగ్: సత్య. జి
నిర్మాణం: మ్యాంగో మాస్ మీడియా
నిర్మాత: రామ కృష్ణ వీరపనేని
దర్శకత్వం: రాకేష్ వర్మ
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ట్యాలెంటెడ్ హీరో నవీన్ చంద్ర ప్రధానపాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ ‘బ్లైండ్ స్పాట్’. నూతన దర్శకుడు రాకేష్ వర్మ దర్శకత్వం వహించగా.. మ్యాంగో మాస్ మీడియా సమర్పణలో రామకృష్ణ వీరపనేని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌజ్ యూవీ క్రియేషన్స్ ఈ సినిమాను రెండు తెలుగు రాష్ట్రాల్లో గ్రాండ్‌గా థియేట్రికల్ రిలీజ్ చేస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్, థియేట్రికల్ ట్రైలర్ సినిమాపై క్యూరియాసిటీని పెంచేశాయి.
ఈ నేపథ్యంలో మర్డర్ మిస్టరీ థ్రిల్లర్‌గా తెరకెక్కిన బ్లైండ్ స్పాట్ చిత్రం భారీ అంచనాల మధ్య నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఇంతకూ ఈ చిత్రం ఎలావుంది? ప్రచారచిత్రాలతోనే ఆసక్తి కలిగించిన ఈ మూవీ థియేటర్లలో ప్రేక్షకులకు థ్రిల్ అందించిందా? రాకేష్ వర్మ దర్శకత్వం మెప్పించిందా? గతకొంతకాలంగా సరైన హిట్ కోసం చూస్తున్న హీరో నవీన్ చంద్ర ఈ మూవీతో సక్సెస్ అందుకున్నాడా? వంటి విషయాలు తెలియాలంటే రివ్యూలోకి వెళ్లాల్సిందే.
కథ:-
జయరామ్ (రవివర్మ), దివ్య (రాశి సింగ్) భార్యాభర్తలు. ఈ దంపతులకు ఒక చిన్న పాప ఉంటుంది. అయితే వీరిద్దరి మధ్య సఖ్యత ఉండదు. వీరి ఇంట్లో లక్ష్మి (గాయత్రీ భార్గవి) పనిమనిషిగా చేస్తుంటుంది. ఒకరోజు రాత్రి అనూహ్యంగా దివ్య తన గదిలో సీలింగ్ ఫ్యాన్‌కి వేలాడుతూ చనిపోయి కనిపిస్తుంది. దీంతో షాక్ అయిన లక్ష్మి పోలీసులకు సమాచారం అందిస్తుంది.
ఇన్ఫర్మేషన్ అందుకున్న పోలీస్ ఆఫీసర్ విక్రమ్ (నవీన్ చంద్ర) ఒక కానిస్టేబుల్‌తో కలిసి అక్కడికి వస్తాడు. వచ్చిరాగానే ఇంటినంతా పరిశీలించి అది ఆత్మహత్య కాదు, హత్య అని తేలుస్తాడు. ఈ తరుణంలో దివ్య భర్త సహా ఆ కుటుంబానికి సన్నిహితంగా ఉండే ప్రతి ఒక్కరినీ విచారిస్తాడు. ఈ క్రమంలో ప్రతిసారీ ఒక కొత్త విషయాన్ని తెలుసుకుంటాడు.
అయితే దివ్య మృతి చెందడానికి కారణం ఏంటి? ఇంతకూ ఆమెది ఆత్మహత్యా? లేదంటే విక్రమ్ అనుమానిస్తున్నట్టు అది హత్యా? ఒకవేళ ఆమెది హత్యే అయితే ఎవరు చేశారు? దీనివెనుక ఎవరున్నారు? ఎందుకు ఆమెను చంపాల్సి వచ్చింది? ఆదిత్య (అలీ రెజా), మానస (హారిక పేడాడ), రాంబాబు (కిషోర్ కుమార్), వినోద్ (అభిషిక్త్) వీరంతా ఎవరు? వీరికి దివ్యకి సంబంధం ఏంటి? చివరికి విక్రమ్ ఏం కనిపెట్టాడు? అన్నదే మిగతా కథ.
విశ్లేషణ:-
బ్లైండ్ స్పాట్ కథగా చూస్తే, కొత్తదేం కాదు. ఒక మర్డర్ జరగడం, దీనిని చేసింది ఎవరు? అనే కోణంలో పోలీస్ ఇన్వెటిగేషన్ జరగడం అనే కాన్సెప్ట్‌తో ఇప్పటికే ఎన్నో సినిమాలు వచ్చాయి. అయితే ఇక్కడే దర్శకుడు రాకేష్ వర్మ మ్యాజిక్ చేశాడు. సినిమా చివరి వరకూ హంతకుడు ఎవరనే ఉత్కంఠను కొనసాగించాడు. అలాగే ఈ హత్య వెనుక దాగిఉన్న నిజాలను నిగ్గు తేల్చేందుకు చేసే పోలీస్ విచారణను అద్భుతంగా నడిపించాడు.
సినిమా ప్రారంభంలోనే నేరుగా కథలోకి తీసుకెళ్లిపోయాడు దర్శకుడు. మహిళ అనుమానాస్పదంగా మృతి చెందడం, పనిమనిషి పోలీసులకు తెలియజేయడం చకచకా జరిగిపోతాయి. విచారణాధికారిగా హీరో ఎంటరవడంతో కథ ఆసక్తికరంగా మారుతుంది. చిన్న చిన్న క్లూస్‌తో ఇది ఆత్మహత్య కాదు, హత్య అని హీరో తేల్చేయడంతో ఇంకొంచెం ఇంట్రెస్ట్ కలుగుతుంది. ఇందులో సంబంధమున్న ఒక్కొక్కరినీ పిలిచి ఇన్వెస్టిగేట్ చేస్తుంటే, చూసే ప్రేక్షకుడికి కుతూహలం పెరిగిపోతుంటుంది.
ఒక్కోసారి ఒక్కొక్కరిపై డౌట్ క్రియేట్ అవుతుంది. ఇలా సాగుతూ సాగుతూ, ఒక్కసారిగా అదిరిపోయే ట్విస్ట్‌తో ఇంటర్వెల్ వస్తుంది. దీంతో సెకండాఫ్‌పై మరింత క్యూరియాసిటీ పెరుగుతుంది. ఇక ద్వితీయార్ధం మొత్తం ఈ హత్య చేసింది ఎవరు? ఎందుకు చేశారు? అనే దిశగా కథ నడుస్తుంది. హీరో ఒక్కో చిక్కు ముడిని విప్పుతూ వెళ్లే సన్నివేశాలను ఉత్కంఠగా తీర్చిదిద్దారు. ఇక క్లైమాక్స్‌లో వచ్చే సర్ప్రైజింగ్ ట్విస్ట్‌కి ఆడియెన్స్ షాక్ అవుతారు. ఇలా బ్లైండ్ స్పాట్ బెస్ట్ థియేటర్ ఎక్స్‌పీరియెన్స్ ఇస్తుంది.
ఇక నటీనటుల విషయానికొస్తే.. నవీన్ చంద్ర స్వతహాగా మంచి నటుడు. ఇప్పటికే ఎన్నో సినిమాల్లో తన సహజమైన నటనతో ఆకట్టుకున్నాడు. హీరోగా చేసిన తొలిసినిమా ‘అందాల రాక్షసి’తో ఆడియెన్స్ మదిని దోచుకున్న నవీన్.. ఆ తర్వాత పలు చిత్రాల్లో గుర్తుండిపోయే పాత్రలు పోషించాడు. సాఫ్ట్ నేచర్ క్యారెక్టర్స్‌తో పాటు మాస్ క్యారెక్టర్స్, నెగటివ్ రోల్స్ లోనూ నటిస్తూ మెప్పిస్తున్నాడు. ఇదేవిధంగా ఇప్పడు ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్‌గా ఆయన అద్భుతమైన నటనను ప్రదర్శించాడు.
అలాగే నటి రాశి సింగ్ నటన మెప్పిస్తుంది. స్టోరీ అంతా తన పాత్ర చుట్టూ నడుస్తుంది. ఉన్నది కొద్దిసేపే అయినా సినిమాపై మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. రవివర్మ, గాయత్రి భార్గవి పాత్రలకు కూడా మంచి ఇంపార్టెన్సే వుంటుంది. ముఖ్యంగా గాయత్రి భార్గవి.. కథలో ఆమె పాత్ర చాలా కీలకంగా వుంటుంది. అలీ రెజా, హారిక పెడదా, హర్ష రోషన్ సహా మిగతా నటులు తమ పాత్రల పరిధిమేరకు డీసెంట్‌గా నటించారు.
ఇక టెక్నికల్ పరంగా చూస్తే బ్లైండ్ స్పాట్ హై స్టాండర్డ్స్‌లో ఉంది. శ్రీరామ్ మద్దూరి అందించిన సంగీతం సినిమాకి ప్లస్ అయిందని చెప్పొచ్చు. ఇలాంటి కథలకు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఎంత ముఖ్యమో తెలిసిందే. దానికి అనుగుణంగానే శ్రీరామ్ అద్భుతమైన బీజీఎమ్ అందించాడు. దర్శన్ అంబట్ సినిమాటోగ్రఫీ మూవీకి మరో ఎస్సెట్. నైట్ విజన్ లోనూ ఆయన కెమెరా స్టోరీ మూడ్‌ని బాగా క్యాచ్ చేసింది.
అలాగే సత్య. జి ఎడిటింగ్ చాలా షార్ప్‌గా ఉంది. అనవసరమైన సీన్ ఒక్కటి కూడా లేదు. రన్ టైమ్ తక్కువ ఉండటం కూడా కలిసొచ్చే అంశం. దీనివలన మూవీ ఎక్కడా బోర్ కొట్టకుండా పరుగెత్తుతున్నట్టు ఉంటుంది. ఇంకా నిర్మాణ విలువలు చాలా ఉన్నతంగా వున్నాయి. దీంతో ప్రతి ఫ్రేమ్ రిచ్‌గా కనిపిస్తుంది. స్టోరీ డిమాండ్ మేరకు నిర్మాత ఖర్చుకి ఎక్కడా రాజీపడలేదని అర్ధమవుతుంది.
బ్లైండ్ స్పాట్ సినిమా కంప్లీట్ సస్పెన్స్ మిస్టరీ ఫార్మాట్లో సాగిపోయే క్రైం థ్రిల్లర్. సీరియస్ టైప్ కథనంతో అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ టచ్ చేస్తూ ఎంటర్టైన్ చేసే డిఫరెంట్ మూవీ అని చెప్పొచ్చు. కథ, కథనం, యాక్టర్స్ పెర్ఫార్మెన్స్ అన్నీ అద్భుతంగా కుదిరాయి. అయితే ఇది కేవలం ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ అనే కాకుండా యూత్, ఫ్యామిలీ ఆడియెన్స్ సహా ప్రతి ఒక్కరినీ అలరించేలావుంది. ఈ సినిమాతో నవీన్ చంద్రకి మంచి హిట్ పడ్డట్టే అని చెప్పొచ్చు.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: