ఓటీటీ లోకి వచ్చేసిన ఓదెల 2

Odela 2 Now Streaming Worldwide on OTT

త‌మ‌న్నా భాటియా ప్రధానపాత్రలో న‌టించిన హైలీ యాంటిసిపేటెడ్ మూవీ ‘ఓదెల‌ 2’. సూపర్ నేచురల్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రంలో ఆమె నెవర్ బిఫోర్ క్యారెక్టర్‌లో నటించారు. 2022లో వచ్చిన సూపర్ హిట్ ‘ఓదెల రైల్వే స్టేషన్’ సినిమాకి ఇది సీక్వెల్‌. అజనీష్ లోకనాథ్ సంగీతం అందించిన ఈ సినిమాలో క‌న్న‌డ న‌టుడు ‘కేజీఎఫ్’ ఫేమ్ వ‌శిష్ట సింహా ప్ర‌తినాయ‌కుడిగా న‌టించ‌గా.. హెబ్బా ప‌టేల్‌, మురళీ శర్మ, శ్రీకాంత్ అయ్యంగార్ కీల‌క పాత్ర‌లు పోషించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

స్టార్ డైరెక్టర్ సంపత్ నంది ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్ రైటర్‌గా మల్టిపుల్ రోల్స్‌లో వర్క్ చేశారు. అలాగే డైరెక్షన్ సూపర్ విజన్‌ని కూడా అందించగా అశోక్ తేజ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ఈ మూవీ నుంచి ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్స్, ట్రైలర్‌ సహా ప్రతి ప్రమోషనల్ కంటెంట్‌కి అద్భుతమైన స్పందన వచ్చింది. ప్రయోగరాజ్ లోని మహా కుంభమేళా సాక్షిగా రిలీజ్ చేసిన టీజర్‌తో నేషనల్ వైడ్‌గా సినిమాపై మంచి బజ్ క్రియేట్ అయింది.

ఈ నేపథ్యంలో ఏప్రిల్ 17న భారీ అంచనాల నడుమ థియేటర్స్‌లో విడుదలైన ఓదెల 2 ప్రేక్షకులను అలరించి మంచి విజయాన్ని అందుకుంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రం ఇప్పుడు డిజిట‌ల్ స్ట్రీమింగ్‌కు వ‌చ్చేసింది. అయితే థియేటర్లలో రిలీజైన కేవ‌లం 20 రోజుల్లోనే ఓటీటీ లోకి వచ్చేయడం విశేషం. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ అమెజాన్ ప్రైమ్ వీడియోలో నిన్న అర్ధరాత్రి నుంచి స్ట్రీమింగ్‌ అవుతోంది. సో మూవీ లవర్స్.. థియేటర్లలో ఈ చిత్రాన్ని మిస్ అయినవారు ఇప్పుడు ఎంచక్కా ఇంట్లోనే కూర్చుని వీక్షించండి.

కథ:-

మొదటి భాగంలో చనిపోయిన తిరుపతి (వశిష్ఠ) ఆత్మ పగతో రగిలిపోతుంది. తిరుపతి ఆత్మ క్షోభకు గురి అవ్వాలి అని ఓదెల గ్రామ ప్రజలు అతడికి సమాధి శిక్ష అమలు చేస్తారు. ఈ శిక్ష చేస్తే, తిరుపతి సమాధిలో బాధ అనుభవిస్తాడు అని అనుకుంటారు. అయితే కొన్ని అనూహ్య పరిణామాల మధ్య అతడి ఆత్మ సమాధి నుంచి బయటకి వస్తుంది. వచ్చీరావడంతోనే ఆ ఊరిలో కొన్ని భయానక పరిస్థితులు సృష్టిస్తాడు. ఊరిలోని జనాన్ని ఆవహించి కొత్తగా పెళ్లి అయినా అమ్మాయిల్ని రేప్ చేసి చంపేస్తుంటాడు తిరుపతి.

దీంతో గ్రామ ప్రజలలో తీవ్ర ఆందోళన మొదలవుతుంది. వేరే దారి లేక ఊళ్ళో వాళ్ళు తిరుపతి భార్య రాధ (హెబ్బా పటేల్) చెప్పిన ప్రకారం పరిష్కారం కోసం భైరవి (తమన్నా)ని ఆశ్రయిస్తారు. అందుకు సమ్మతించిన ఆమె ఓదెల గ్రామానికి వస్తుంది. అయితే అక్కడ సమస్య భైరవి భావించినంత సులువుగా పరిష్కారమవదు. ఇంతకూ తిరుపతి ఆత్మను భైరవి కంట్రోల్ చేయగలిగిందా? లేదంటే తిరుపతే పైచేయి సాధించాడా? ఓదెల మల్లన్న తన మహిమను చూపించాడా? అనేది మిగతా కథ.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.