నటనలో నాకు ఇన్‌స్పిరేషన్‌ మెగాస్టారే – అల్లు అర్జున్

Icon Star Allu Arjun Says, Megastar Chiranjeevi is Big Inspiration For Me

నటనకు సంబంధించి తనకు ఇన్‌స్పిరేషన్‌ మెగాస్టార్ చిరంజీవే అని పేర్కొన్నారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. ఈ మేరకు ఆయన తాజాగా ముంబై లోని జియో కన్వెన్షన్‌ సెంటర్‌ వేదికగా కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించిన ‘వరల్డ్‌ ఆడియో విజువల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సమ్మిట్‌’ (వేవ్స్‌)లో పాల్గొన్న సందర్భంగా వెల్లడించారు. కాగా అంతర్జాతీయ స్థాయిలో భారత్‌ను గ్లోబల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ హబ్‌గా మార్చాలనే లక్ష్యంతో కేంద్రం దీనిని నిర్వహిస్తోంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

గురువారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతులమీదుగా ప్రారంభం అయిన ఈ వేడుకలో దేశవ్యాప్తంగా వివిధ భాషలకు చెందిన పలువురు ప్రముఖ నటీనటులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అల్లు అర్జున్ మాట్లాడుతూ.. “వేవ్స్‌’నిర్వహించిన కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు. సినిమానే నా ప్రపంచం. యాక్టర్‌గా ఎన్నో చాలెంజెస్ ఫేస్ చేశా. ప్రేక్షుకులు నాపై చూపించిన అభిమానం వల్లే ఈ స్థ్థాయికి చేరుకున్నా.” అని అన్నారు.

ఇంకా ఆయన మాట్లాడుతూ.. “ఇప్పటికి సాధించిన తక్కువే, సాధించాల్సింది ఇంకా చాలా వుంది. అయితే చిన్నప్పటినుంచే నాకు డ్యాన్స్‌ అంటే చాలా ఇష్టం. ఇక నటనలో మా అంకుల్ చిరంజీవి నాకు స్ఫూర్తి. నా జీవితంలో ఆయన ప్రభావం ఎంతో ఉంది. డైరెక్టర్ అట్లీ చెప్పిన ఐడియా నన్ను ఇంప్రెస్ చేసింది. భారీ హంగులతో, విజువల్‌ ఎఫెక్ట్స్‌ పరంగా ఆడియెన్స్ కి సరికొత్త అనుభూతి పంచుతుంది’’ అని తెలిపారు. కాగా నిన్న మొదలైన ఈ వేవ్స్‌ వేడుక మే 4 వరకు కొనసాగనుంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.