నాని హిట్ 3 ఊహించని విధంగా బాక్సాఫీస్ వద్ద రాంపేజ్ కొనసాగిస్తోంది. నిన్న మంచి అంచనాల మధ్య థియేటర్లలోకి వచ్చిన ఈసినిమా పాజిటివ్ రివ్యూస్ తెచ్చుకోవడంతో తొలి రోజు రికార్డు స్థాయిలో ఓపెనింగ్స్ ను రాబట్టింది.ప్రపంచ వ్యాప్తంగా మొదటి రోజు 43 కోట్ల గ్రాస్ వసూళ్లను సొంతం చేసుకుంది. దాంతో దసరా ఓపెనింగ్స్ ను దాటేసి నాని కెరీర్ లో బిగ్గెస్ట్ ఓపెనర్ గా హిట్ 3 రికార్డు సృష్టించింది.ఇంతకుముందు దసరా మొదటి రోజు 38కోట్ల వసూళ్లను రాబట్టింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
వైలెన్స్ ఎక్కువగా వున్నా ఫ్యామిలీ ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటుంది హిట్ 3.మొదటి రోజు కలెక్షన్స్ తో 40శాతం బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను పూర్తి చేసింది.హిట్ 3 తెలుగు రాష్ట్రాల్లోనే కాదు చెన్నై ,కేరళ , బెంగుళూరు లోకూడా సాలిడ్ వసూళ్లను దక్కించుకుంది. ఈరోజు కూడా బుకింగ్స్ బాగున్నాయి.ఈ ఆదివారం తో 100కోట్ల మార్క్ ను క్రాస్ చేయొచ్చు. ఇక ఈసినిమా తోనాని వరసగా నాలుగో విజయాన్ని ఖాతాలో వేసుకోనున్నాడు.
మొత్తానికి గత కొన్ని నెలలు గా సరైన సినిమాలు లేక వెలవెల బోయిన బాక్సాఫీస్ హిట్ 3 వల్ల మళ్ళీ కలకలలాడుతోంది.కింగ్డమ్ వచ్చేవరకు సరైన సినిమా లేకపోవడం హిట్ 3 కి కలిసి రానుంది.మరి ఈసినిమా ఫుల్ రన్ లో ఇంకెన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి. శైలేష్ కొలను ఈసినిమాను డైరెక్ట్ చేయగా శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటించింది.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























