థగ్ లైఫ్ ఫస్ట్ సింగిల్ రిలీజ్

Thug Life First Single Jinguchaa Released

ఉలగనాయకన్ కమల్ హాసన్ హీరోగా లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కుతోన్న మచ్ అవైటెడ్ మూవీ ‘థగ్ లైఫ్‌’. 37 సంవత్సరాల క్రితం వీరి కాంబోలో వచ్చిన ఆల్-టైమ్ క్లాసిక్‌ ‘నాయకుడు’ తర్వాత మళ్ళీ వీరిద్దరూ కలిసి చేస్తుండటం విశేషం. కమల్ హాసన్ ‘విక్రమ్’, మణిరత్నం ‘పొన్నియిన్ సెల్వన్’ సినిమాల తర్వాత వస్తోన్న చిత్రం కావడంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి..

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈ చిత్రంలో ఐశ్వర్య లక్ష్మి, త్రిష ఫీమేల్‌ లీడ్ రోల్స్‌లో నటిస్తుండగా.. యంగ్ హీరోలు శింబు, గౌతమ్‌ కార్తీక్‌, అశోక్ సెల్వన్, నాజర్, మరియు పాపులర్ మాలీవుడ్ యాక్టర్‌ జోజు జార్జ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. కమల్ హాసన్ పుట్టినరోజు సందర్భంగా, మేకర్స్ టీజర్‌ను విడుదల చేయగా, అది సినిమాపై క్యూరీయాసిటీని పెంచింది. థగ్‌ లైఫ్‌ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులపై యూనిట్ దృష్టి సారించింది.

కాగా ఈ సినిమా జూన్ 5న గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ మ్యూజికల్ ప్రమోషన్స్ కిక్ స్టార్ట్ చేశారు. తాజాగా ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేసింది చిత్రయూనిట్. ‘జింగుచా’ అంటూ సాగే ఈ పాటకు అనంత శ్రీరామ్ సాహిత్యం అందించగా.. గాయకులు మంగ్లీ, శ్రీ కృష్ణ, ఆషిమా మహాజన్, వైశాలి సమంత్ తదితరులు ఆలపించారు. ఈ విజువల్ వండర్‌కి ఆస్కార్ విన్నింగ్ కంపోజర్, మ్యూజిక్ లెజెండ్ ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న విషయం తెలిసిందే.

ప్రముఖ సినిమాటోగ్రాఫర్ రవి కె. చంద్రన్ సినిమాటోగ్రఫీని నిర్వహిస్తుండగా, జాతీయ అవార్డు గ్రహీత ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ చేస్తున్నారు. మద్రాస్ టాకీస్‌, రాజ్ కమల్ ఫిలింస్ ఇంటర్నేషనల్‌పై కమల్ హాసన్, మణిరత్నం, ఆర్. మహేంద్రన్ మరియు శివ అనంత్‌ భారీ బడ్జెట్‌తో ఈ సినిమాని నిర్మించారు. ఉదయనిధి స్టాలిన్ రెడ్ జెయింట్ మూవీస్ ఈ సినిమాని సమర్పిస్తోంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.