మలయాళం స్టార్ మోహన్ లాల్ లేటెస్ట్ మూవీ తుడరుమ్ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. లో హైప్ తో రిలీజైన ఈసినిమాకు యూనానిమస్ పాజిటివ్ టాక్ రావడం తో రోజు రోజుకి కలెక్షన్స్ పెంచుకుంటూ పోతుంది. నాలుగు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 80కోట్ల వసూళ్లను రాబట్టుకుంది.రేపటి తో 100కోట్ల క్లబ్ లో చేరనుంది. మినిమమ్ ప్రమోషన్స్ కూడా చేయకుండానే మోహన్ లాల్ కు వున్న ఇమేజ్ తో షాకింగ్ వసూళ్లను రాబట్టుకుంది. ఫుల్ రన్ లో ఈసినిమా 150కోట్ల క్లబ్ లో చేరనుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక కేరళ లో మొదటి మూడు రోజులు అదరగొట్టిన ఈసినిమా నాల్గో రోజు అయితే మొదటి రోజు కంటే ఎక్కువగా రాబట్టి షాక్ ఇచ్చింది.దాదాపు నిన్న ఒక్క రోజే 7 కోట్ల వసూళ్లను దక్కించుకుంది. దాంతో అక్కడ నాలుగు రోజుల్లో 27 కోట్ల వసూళ్ళను సొంతం చేసుకుంది.
ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తరుణ్ మూర్తి తెరకెక్కించిన ఈసినిమాలో శోభన , థామస్ మాథ్యూ, షైజో ఆదిమాలి కీలక పాత్రల్లో నటించగా జెక్స్ బిజోయ్ సంగీతం అందించాడు.తెలుగులో కూడా ఈసినిమా రిలీజ్ కాగా ఆశించిన రెస్పాన్స్ రాలేదు.
ఇక గత నెలలో ఎల్ 2: ఎంపురాన్ తో కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ కొట్టాడు మోహన్ లాల్.ఈసినిమా 200కోట్ల పైనే వసూళ్లను రాబట్టింది. ఇక ఇప్పుడు నెల గ్యాప్ లో తుడరుమ్ తో సెకండ్ బ్లాక్ బస్టర్ ను ఖాతాలో వేసుకున్నాడు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























