నేచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ హైలీ యాంటిసిపేటెడ్ క్రైమ్ థ్రిల్లర్ ‘హిట్: ది 3rd కేస్’. శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం, ఇప్పటికే రిలీజ్ చేసిన గ్లింప్స్, పోస్టర్స్, టీజర్, ఫస్ట్ సింగిల్‌తో హ్యుజ్ బజ్ క్రియేట్ చేసింది. వాల్ పోస్టర్ సినిమా బ్యానర్‌పై ప్రశాంతి తిపిర్నేని, నాని యూనానిమస్ ప్రొడక్షన్స్ బ్యానర్‌తో కలిసి నిర్మిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇందులో నాని టెర్రిఫిక్, బ్రూటల్ ఇన్వెస్టిగేటివ్ పోలీస్ ఆఫీసర్ అర్జున్ సర్కార్ పాత్రలో కనిపిస్తుండగా.. ‘కేజీఎఫ్’ ఫేమ్ శ్రీనిధి శెట్టి కథానాయికగా నటిస్తోంది. ఇటీవలే ఈ సినిమా నుండి ఫస్ట్ సింగిల్ ‘ప్రేమ వెల్లువ’ అనే మెలోడీ సాంగ్ విడుదలచేసిన చిత్రయూనిట్.. తాజాగా సెకండ్ సింగిల్ రిలీజ్ చేసింది. ‘అబ్ కి బార్.. అర్జున్ సర్కార్’ పేరుతో సాగే ఈ పాట హీరో క్యారక్టరైజేషన్ గురించి వివరించి పోలీస్ పవర్ తెలిపేలావుంది.
ఈ పాట అర్జున్ సర్కార్ పాత్రకు ప్రాణం పోసింది. ఇది అతని వ్యక్తిత్వాన్ని ప్రజెంట్ చేస్తోంది, ఈ సాంగ్ అతని ఫెరోషియస్ ఎనర్జీని సూచిస్తోంది. అతను తన శత్రువులకు పీడకల, తప్పుకు ప్రతీకారం తీర్చుకునే కఠినమైన తత్వాన్ని కలిగి ఉంటాడు. కృష్ణకాంత్ రాసిన సాహిత్యంతో అతని పాత్ర సారాంశాన్ని పాట ద్వారా అద్భుతంగా చూపించారు.
మిక్కీ జె మేయర్ ఆకట్టుకునే ట్రాక్‌ను, ఎలక్ట్రిఫైయింగ్ ఆర్కెస్ట్రేషన్ తో కంపోజ్ చేశారు, అనురాగ్ కులకర్ణి డైనమిక్ వాయిస్ సాంగ్ ని మరోస్థాయికి తీసుకెళుతుంది. నాని కమాండింగ్ ప్రజెన్స్, సాంగ్ లో ఇంటెన్స్ ఎనర్జీని నింపుతుంది. అర్జున్ సర్కార్ ఎసెన్స్ ని కంప్లీట్ గా ప్రజెంట్ చేసే అడ్రినలిన్-చార్జ్డ్ యాంథమ్ ని క్రియేట్ చేస్తోంది.
ఇక హిట్ 3 చిత్రానికి సాను జాన్ వర్గీస్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. మిక్కీ జె మేయర్ సంగీతం సమకూరుస్తున్నాడు. అలాగే కార్తీక శ్రీనివాస్ ఆర్ ఎడిటింగ్ చేస్తుండగా.. శ్రీ నాగేంద్ర తంగాల ప్రొడక్షన్ డిజైన్ చేశారు. క్రైమ్ థ్రిల్లర్ జోనర్ ని ఈ చిత్రం రిడిఫైన్ చేసిన ఆడియన్స్ కు నెవర్ బిఫోర్ ఎక్స్ పీరియన్స్ అందించబోతోంది. కాగా హిట్: ది 3rd కేస్ మే 1, 2025న థియేటర్లలో విడుదల కానుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























