మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా హైలీ యాంటిసిపేటెడ్ మూవీ ‘ఓదెల 2’లో నెవర్ బిఫోర్ క్యారెక్టర్ లో అలరించడానికి సిద్ధంగా వున్నారు. సూపర్ నాచురల్ థ్రిల్లర్ ‘ఓదెల రైల్వే స్టేషన్’కి సీక్వెల్ ఇది. అశోక్ తేజ దర్శకత్వంలో, మధు క్రియేషన్స్, సంపత్ నంది టీమ్ వర్క్స్‌పై డి మధు నిర్మించిన ఈ చిత్రం ప్రతి అప్డేట్తో హ్యుజ్ బజ్ క్రియేట్ చేస్తోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇటీవలి రీలీజిన టీజర్ ఎక్సయిట్మెంట్ పెంచింది, అంచనాలను మరో స్థాయికి తీసుకెళ్ళింది. ఈ నేపథ్యంలో మేకర్స్ ఇప్పుడు ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ అప్డేట్తో వచ్చారు. ఓదెల 2 థియేట్రికల్ ట్రైలర్ ఈ నెల 8న ముంబైలో జరిగే అద్భుతమైన ఈవెంట్ లో గ్రాండ్‌గా లాంచ్ కానుంది. కోర్ టీమ్ హాజరు కానున్న ఈ కార్యక్రమంలో టీమ్ తెలుగు, హిందీ ట్రైలర్లను లాంచ్ చేయనుంది.
ఈ సినిమా ప్రారంభోత్సవం కాశీలో జరిగింది. టీజర్‌ను కుంభమేళాలో లాంచ్ చేశారు. ఇప్పుడు, ట్రైలర్‌ను లాంచ్ చేయడానికి మేకర్స్ ముంబైని ఎన్నుకున్నారు. విడుదల దగ్గర పడుతుండటంతో ఓదెల 2 ప్రచార కార్యక్రమాలు దూకుడుగా జరుగుతున్నాయి. ఏప్రిల్ 17న థియేటర్లలో విడుదల కానున్న ఓదెల 2 ఈ వేసవిలో బిగ్గెస్ట్ ఎట్రాక్షన్ లో ఒకటిగా నిలుస్తుంది.
తమన్నా భాటియా నాగ సాధువుగా అద్భుతంగా నటించి పవర్ ఫుల్ పాత్రకు ప్రాణం పోశారు. అలాగే హెబ్బా పటేల్, వశిష్ట ఎన్ సింహ కీలక పాత్రలు పోషిస్తున్నారు. వీరితోపాటుగా యువ, నాగ మహేష్, వంశీ, గగన్ విహారి, సురేందర్ రెడ్డి, భూపాల్, పూజా రెడ్డి తదితరులు ఈ చిత్రంలో ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు.
ఎక్సయిటింగ్ యాక్షన్‌ను అద్భుతమైన కథలతో కలపగల సామర్థ్యం వున్న సంపత్ నంది ఓదెల 2 చిత్రాన్ని సూపర్ విజన్ చేస్తున్నారు. ఇక ఈ చిత్రానికి కాంతర ఫేం అజనీష్ లోక్‌నాథ్ మ్యూజిక్ అందిస్తున్నారు. రాజీవ్ నాయర్ ఆర్ట్ డైరెక్టర్, సౌందర్‌రాజన్ ఎస్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. టాలెంటెడ్ టీమ్‌తో ఓదెల 2 సినిమా మెమరబుల్ ఎక్స్ పీరియన్స్ ని అందించబోతోంది.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























