టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ తిరుమల సందర్శించారు. ఈ మేరకు శనివారం ఉదయం కుటుంబసభ్యులతో కలిసి తిరుమల చేరుకున్న ఆయన శ్రీవారి సేవలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయానికి చేరుకున్న నాగ్ అశ్విన్‌కి తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. ఇక దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు ఆయనను శేషవస్త్రంతో సత్కరించి వేదాశీర్వచనం చేశారు. అలాగే TTD అధికారులు స్వామివారి చిత్రపటం, తీర్థప్రసాదాలు అందజేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా గతేడాది నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన ‘కల్కి 2898 AD’ చిత్రం సంచలన విజయం అందుకున్న విషయం తెలిసిందే. పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కిన ఈ సినిమాలో రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించగా.. బాలీవుడ్ స్టార్ నటి దీపికా పదుకొణె ఫిమేల్ లీడ్ రోల్‌లో కనిపించింది. ఇంకా లెజెండరీ నటులు అమితాబ్ బచ్చన్ మరియు కమల్ హాసన్ కీలక పాత్రల్లో కనిపించారు. 1100 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి రికార్డ్ సృష్టించింది. ఇక త్వరలోనే ఈ మూవీ సీక్వెల్‌ను పట్టాలెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నారు దర్శకుడు నాగ్ అశ్విన్.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























