నారి నారి నడుమ మురారి ఫస్ట్ సింగిల్ వస్తోంది

Sharwanand’s Nari Nari Naduma Murari First Single Darsanamey Release Date Fix

చార్మింగ్ స్టార్ శర్వానంద్ హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘నారి నారి నడుమ మురారి’. ‘సామజవరగమన’ ఫేమ్ రామ్ అబ్బరాజు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సాక్షి వైద్య, సంయుక్త కథానాయికలుగా నటించారు. షూటింగ్ దాదాపు పూర్తయ్యే దశలో ఉంది. ఇప్పటికే, సినిమా నుండి ఫస్ట్ లుక్, ఇతర పోస్టర్లు మంచి బజ్ క్రియేట్ చేశాయి. ఈ నేపథ్యంలో తాజాగా మేకర్స్ ఈ మూవీ ఫస్ట్ సింగిల్ అప్‌డేట్ ఇచ్చారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ సినిమా మ్యూజిక్ జర్నీ ఏప్రిల్ 7న విడుదల కానున్న ‘దర్శనమే’ అనే పాటతో ప్రారంభమవుతుంది. విశాల్ చంద్ర శేఖర్ సంగీతం అందించిన ఈ పాటలో శర్వా, సంయుక్త నటించారు. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన సాంగ్ పోస్టర్ లో శర్వా, సంయుక్త రొమాంటిక్ బైక్ రైడ్ ఆస్వాదిస్తున్నారు. శర్వా క్యాజువల్ టీ-షర్ట్, బ్లాక్ ప్యాంటులో చాలా స్టైలిష్ గా కనిపిస్తుండగా, సంయుక్త తన సాంప్రదాయ దుస్తులలో అందంగా వుంది.

ఈ చిత్రానికి జ్ఞాన శేఖర్ వి.ఎస్, యువరాజ్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. బ్రహ్మ కడలి ఆర్ట్ డైరెక్షన్ నిర్వర్తిస్తున్నారు. భాను బోగవరపు కథను రాయగా, నందు సావిరిగణ సంభాషణలను అందించారు. అనిల్ సుంకర ఎకె ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రామబ్రహ్మం సుంకర, అడ్వెంచర్స్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ తో కలిసి నిర్మించిన ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకురానుంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.