టీవీ యాంకర్ టర్న్డ్ హీరో ప్రదీప్ మాచిరాజు మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ వేసవిలో వన్ అఫ్ ది బిగ్గెస్ట్ ఎట్రాక్షన్ గా ఏప్రిల్ 11న థియేటర్లలోకి రావడానికి సిద్ధంగా ఉంది. మాంక్స్ & మంకీస్ బ్యానర్ నిర్మిస్తున్న ఈ యూనిక్ లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ను యంగ్ ట్యాలెంటెండ్ డైరెక్టర్స్ డుయో నితిన్, భరత్ దర్శకత్వం వహిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
దీపికా పిల్లి కథానాయికగా నటిస్తుండగా.. వెన్నెల కిషోర్, సత్య, గెటప్ శ్రీను, మురళీధర్ గౌడ్, జి ఎం సుందర్, జాన్ విజయ్, రోహిణి, ఝాన్సీ, తదితరులు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. టీజర్, పాటలు ఇప్పటికే అద్భుతమైన రెస్పాన్స్ అందుకున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా మేకర్స్ థియేట్రికల్ ట్రైలర్‌ను లాంచ్ చేశారు. చూస్తుంటే, ఈ సినిమా హిలేరియస్ ఎంటర్‌టైనర్‌గా రూపొందినట్టు అర్ధమవుతోంది. ప్రస్తుతం ఇది మంచి స్పందన రాబట్టుకుంటోంది.
ఈ కథ ఒక మారుమూల గ్రామంలో ఒక ప్రాజెక్ట్‌ను సూపర్ వైజ్ చేయడానికి నియమించబడిన సివిల్ ఇంజనీర్ చుట్టూ నడిచింది, అక్కడ అతను 60 మంది అనుభవం లేని కార్మికులతో పని చేయించాలి గ్రామస్తులలో, ఒకే ఒక అమ్మాయి ఉంది, ఆమె తండ్రి 60 మందిలో ఒకరిని పెళ్లి చేసుకోవాలని అనౌన్స్ చేస్తాడు. ప్రాజెక్ట్ ముందుకు సాగుతున్న కొద్దీ, ఇంజనీర్ మరియు అమ్మాయి ఇద్దరూ ప్రేమలో పడతారు. తర్వాత జరిగే సిచువేషన్స్ చాలా ఎక్సైటింగ్ గా టర్న్ అవుతాయి.
నితిన్-భరత్ ద్వయం హ్యుమర్ తో కూడిన ప్రత్యేకమైన కథాంశాన్ని ఎంచుకున్నారు. ఎక్సయిటింగ్ సిచువేషన్స్ తో నవ్వును అందించడంలో వారు విజయం సాధించారు. డైలాగ్స్ ఆకట్టుకున్నాయి. ప్రదీప్ మాచిరాజు తన పాత్రకు పెర్ఫెక్ట్ గా ఫిట్ అయ్యారు, తన టైమింగ్ తో హ్యుమర్ ని అద్భుతంగా పండించారు. దీపికా పిల్లి పెర్ఫార్మెన్స్ కి స్కోప్ వుండే పాత్రలో కనిపించింది. వెన్నెల కిషోర్, సత్య, గెటప్ శ్రీను వినోదాన్ని పుష్కలంగా అందించారు.
MN బాల్‌రెడ్డి గ్రామీణ వాతావరణాన్ని అందంగా చూపించారు, రధన్ సంగీతం ప్లజెంట్ గా వుంది. కోదాటి పవన్ కళ్యాన్ ఎడిటర్ . నిర్మాణ విలువలు ఉన్నతంగా వున్నాయి. కథ, డైలాగ్స్ సందీప్ బొల్లా రాశారు. అశిష్టేజ పులాల ప్రొడక్షన్ డిజైనర్. మొత్తంమీద, అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి రొమాన్స్, విలేజ్ డ్రామాతో కూడిన వినోదాత్మకంగా ఉంటుందని ఈ ట్రైలర్ హామీ ఇస్తుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























