హీరో నితిన్ హైలీ యాంటిసిపేటెడ్ హీస్ట్ కామెడీ ఎంటర్ టైనర్ రాబిన్‌హుడ్. శ్రీలీల కథానాయికగా నటించింది. వెంకీ కుడుముల దర్శకత్వం వహించిన ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ హై బడ్జెట్ తో నిర్మించింది. ఈ చిత్రంలో నట కిరీటి రాజేంద్రప్రసాద్ కీలక పాత్ర పోషించారు. ఆస్ట్రేలియా డైనమిక్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ ప్రత్యేక అతిధి పాత్రలో నటించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ హ్యుజ్ బజ్ క్రియేట్ చేసింది. జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందించిన పాటలు చార్ట్ బస్టర్ హిట్ అయ్యాయి. ఈ సినిమా మార్చి 28న థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ ప్రీరిలీజ్ ఈవెంట్, ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ చీఫ్ గెస్ట్ గా హాజరైన ఈ ఈవెంట్ చాలా గ్రాండ్ గా జరిగింది. ట్రైలర్ అయితే అదిరిపోయింది.
ఈ సందర్భంగా హీరో నితిన్ చిత్ర బృందానికి థాంక్స్ చెప్పారు. నితిన్ ఏమన్నారో ఆయన మాటల్లోనే.. “అందరికీ నమస్కారం. ఆర్ డైరెక్టర్ రామ్ కుమార్ గారు, ఎడిటర్ కోటి, డిఓపి సాయి శ్రీరామ్ ఈ ముగ్గురు చాలా అద్భుతమైనటువంటి వర్క్ ఇచ్చారు. జీవీ ప్రకాష్ కుమార్ గారు వండర్‌ఫుల్ మ్యూజిక్ ఇచ్చారు. ఆల్రెడీ సాంగ్స్ పెద్ద హిట్ అయ్యాయి. బీజీఎం అదిరిపోతుంది. సినిమా చూస్తున్నప్పుడు మీరే చెప్తారు.”
“మా సినిమాలో నటించిన అందరి ఆర్టిస్టులకి థాంక్యూ సో మచ్. ఈ సినిమాపై చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాను. మార్చి 28న మీరు చూస్తారు. ఇది నాకు, శ్రీలీలకి సెకండ్ మూవీ. ఫస్ట్ సినిమా పెద్దగా ఆడలేదు. ఈ సినిమా డెఫినెట్ గా ఆడుతుంది. మా ఇద్దరికీ హిట్ పెయిర్ అనే పేరు వస్తుంది. ఈ సినిమా అందరూ ఎంజాయ్ చేస్తారు. కేతిక తన ప్రజెన్స్ తో సర్ప్రైజ్ సాంగ్ ని మరో లెవల్ కి తీసుకెళ్ళింది.”
“ఇక మా నిర్మాతలు మైత్రి నవీన్ గారు, రవి గారు.. సినిమాకి వాళ్లే రియల్ హీరోస్. వాళ్ళు లేకపోతే మేము లేము. ఇండియాలో మైత్రి ఈరోజు టాప్ ప్రొడక్షన్ హౌస్. సినిమాని చాలా భారీగా తీశారు. దేవుడిచ్చిన తమ్ము వెంకీ. నామీద తనకి ఎంత ప్రేమ ఉందో ఈ సినిమాతో చూపించాడు. మార్చి 28న అది మీరు విట్నెస్ చేస్తారు.”
“క్రికెట్ లెజెండ్ డేవిడ్ వార్నర్ భాయ్ ప్రజెన్స్ తో ఈ సినిమా మరో లెవల్ కి వెళ్ళింది. వార్నర్ క్రికెట్ లో ఎంత ఉత్సాహంగా ఉంటారో సినిమాలో కూడా అంతా ఉత్సాహంగా కనిపిస్తారు. ఇందులో అతని కామియో చిన్నదైనా చాలా ఇంపాక్ట్ ఫుల్ గా ఉంటుంది. సినిమాకి ఒక హై ఇస్తుంది. సినిమా ఖచ్చితంగా మీ అందరినీ అలరిస్తుంది” అని అన్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: