నేచురల్ స్టార్ నాని వాల్ పోస్టర్ సినిమా సమర్పించిన మూవీ ‘కోర్ట్’ – స్టేట్ వర్సెస్ ఎ నోబడీ’ ప్రియదర్శి ప్రధాన పాత్రలో నటిస్తున్న నటిస్తున్న ఈ చిత్రాన్ని రామ్ జగదీష్ దర్శకత్వం వహించారు. ప్రశాంతి తిపిర్నేని నిర్మించారు. దీప్తి గంటా సహ నిర్మాతగా వ్యవహరించారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేసింది. ఈ చిత్రం మార్చి 14న హోలీ పండుగ సందర్భంగా విడుదల కానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ సందర్భంగా మేకర్స్ ప్రీరిలీజ్ అండ్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ని నిర్వహించారు. బ్లాక్ బస్టర్ డైరెక్టర్స్ నాగ్ అశ్విన్, ప్రశాంత్ వర్మ, శైలేష్ కొలను, శ్రీకాంత్ ఓదెల, శౌర్యువ్, ఇంద్రగంటి మోహన కృష్ణ, దేవకట్టా ఈ వేడుకలో అతిధులుగా పాల్గొన్నారు. మూవీ యూనిట్ అంతా పాల్గొన్న ఈ వేడుక చాలా గ్రాండ్‌గా జరిగింది.
ఈ సందర్భంగా డైరెక్టర్ నాగ్ అశ్విన్ మాట్లాడుతూ.. “అందరికీ కంగ్రాట్స్. ఇది ఒక స్పెషల్ ఈవెంట్ లా ఉంది. బిహైండ్ ది సీన్స్ కోర్ట్ ఒక సినిమా తీస్తే ఎలా ఉంటుందో ఈవెంట్ అలా ఉంది. చాలా ఫ్రెష్ టాలెంట్. అందరిలో ప్యాషన్ కనిపిస్తోంది. ఫస్ట్ సినిమాకి ఎంత ఎక్సైట్మెంట్ ఉంటుందో నాకు తెలుసు. జగదీష్ ఫేస్ లో అది నాకు కనిపించింది” అని అన్నారు.
ఇంకా ఆయన మాట్లాడుతూ.. “పదేళ్ల క్రితం ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాకి నేను కూడా అదే పొజిషన్లో ఉన్నాను. అప్పటినుంచి ఇప్పటివరకు నేను ఒక మూడు సినిమాలు చేశాను. కానీ నాని ఒక 20 సినిమాలు చేశారు. యాక్టర్ గా, ప్రొడ్యూసర్ గా ఇంత స్పీడ్ గా ఎలా చేస్తున్నారని చాలా సార్లు అడిగాను. నిజంగా అది గొప్ప లెగసి. ఈ సినిమా మ్యాసీవ్ సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను” అని అన్నారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్



మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: