రెండేళ్ల క్రితం కాలేజ్ బ్యాక్ డ్రాప్ లో యూత్ ఫుల్ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన మ్యాడ్ సూపర్ హిట్ అనిపించుకుంది. నార్నె నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ లీడ్ రోల్స్‌లో నటించారు. ఇక ఈ సినిమాకు సీక్వెల్ వస్తుంది. మ్యాడ్ స్క్వేర్ అనే టైటిల్‌తో తెరక్కుతుండగా దాదాపు ఫస్ట్ పార్ట్‌లో వున్నవారే ఇందులోనూ కనిపించనున్నారు. సినిమా షూటింగ్ కూడా చివరి దశకు చేరుకుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
మార్చి 29న ఈ సినిమా విడుదలకానుంది. అంతకన్నా ఒక్క రోజు ముందు నితిన్ రాబిన్ హుడ్ వస్తుంది. ఇక గత ఏడాది మార్చి 29న వచ్చిన టిల్లు స్క్వేర్ 100కోట్లకు పైగా వసూళ్లను సాధించి బ్లాక్ బస్టర్ అయ్యింది. ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మించింది. మ్యాడ్ స్క్వేర్‌ను కూడా ఇదే సంస్థ నిర్మిస్తుంది. దాంతో సెంటిమెంట్‌గా అదే డేట్‌ను లాక్ చేశారు.
ఇప్పటివరకు రెండు పాటలు రిలీజ్ కాగా సూపర్ రెస్పాన్స్ వచ్చింది. భీమ్స్ సిసిరోలియో అందించిన సాంగ్స్ సూపర్ హిట్ అయ్యి మ్యాడ్ సినిమా విజయంలో కీలక పాత్ర పోషించాయి. ఈ నేపథ్యంలోనే మ్యాడ్ స్క్వేర్ టీజర్ రిలీజ్ అప్‌డేట్ ఇచ్చారు మేకర్స్. రేపు (ఫిబ్రవరి 25) మధ్యాహ్నం 3:33 గంటలకి విడుదలచేయనున్నట్టు ప్రకటించారు మేకర్స్.
టిల్లు స్క్వేర్ కూడా సీక్వెలే. మరి మ్యాడ్ స్క్వేర్‌కి కూడా ఆ సెంటిమెంట్ వర్క్ అవుట్ అవుతుందో చూడాలి. నిజానికి మార్చిలో విజయ్ దేవరకొండ 12వ సినిమాను రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ షూటింగ్ ఆలస్యం కావడంతో మ్యాడ్ స్క్వేర్‌ను దించుతున్నారు. కళ్యాణ్ శంకర్ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తుండగా భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నాడు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























