ఆనంది, వరలక్ష్మి శరత్‌కుమార్ ప్రధాన పాత్రలలో దేవరాజ్ భరణి ధరణ్ దర్శకత్వంలో ఫస్ట్ కాపీ మూవీస్ బ్యానర్ పై నరేష్ బాబు పి. నిర్మించిన పవర్ ఫుల్ విమెన్ సెంట్రిక్ ఫిల్మ్ శివంగి. జాన్ విజయ్, డాక్టర్ కోయ కిషోర్ కీలక పాత్రల్లో నటించారు. ఇటివలే రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ రోజు మేకర్స్ సినిమా ‘శివంగి’ బోల్డ్ అండ్ సెన్సేషనల్ టీజర్ ని రిలీజ్ చేశారు. ఒక క్రైమ్ సీన్ ని ప్రజెంట్ చేస్తూ ఓపెన్ అయిన టీజర్ ఆద్యంతం గ్రిప్పింగ్ గా సాగింది. వరలక్ష్మి శరత్‌కుమార్ కు ఆనందిని విచారించడంతో అసలు కాన్ఫ్లిక్ట్ తెరపైకి వస్తుంది.
ఆనంది జీవితంలో జరిగిన రెండు ముఖ్య విషయాలు తనని వెంటాడుతాయి. తర్వాత ఆమె ఎలాంటి నిర్ణయం తీసుకుందనేది చాలా ఎక్సయిటింగ్ వుంది. ”వంగేవాళ్ళు ఉన్నంత వరకు.. మింగేవాళ్ళు ఉంటారు. నేను వంగే రకం కాదు.. మింగే రకం” అని ఆనంది చెప్పిన బోల్డ్ డైలాగ్ టీజర్ ని నెక్స్ట్ లెవల్ కి తీసుకెళ్ళింది.
ఆనంది క్యారెక్టర్ పెర్ఫార్మెన్స్ అదిరిపోయింది. వరలక్ష్మిశరత్‌కుమార్ ప్రజెన్స్ కట్టిపడేసింది. దేవరాజ్ భరణి ధరన్ నెవర్ బిఫోర్ స్టొరీ తో ప్రేక్షకులని అలరించబోతున్నారని టీజర్ చూస్తే అర్ధమౌతోంది. A.H కాషిఫ్ – ఎబినేజర్ పాల్ మ్యూజిక్, భరణి కె ధరన్ కెమరా వర్క్ థ్రిల్లింగ్ ఎక్స్ పీరియన్స్ ని మరింత పెంచుతున్నాయి. మార్చి 7న రిలీజ్ కానున్న ఈ సినిమాపై ఈ టీజర్ అంచనాలని మరింతగా పెంచింది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: