మెగాస్టార్ చిరంజీవి మాతృమూర్తి అంజనాదేవి అస్వస్థతకు గురైనట్టు నిన్న ఉదయం నుంచీ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్న నేపథ్యంలో ఆయన దీనిపై స్పందించారు. ఆ వార్తల్లో నిజం లేదని, ప్రస్తుతం ఆమె ఆరోగ్యం బాగానే ఉందని తెలిపారు. కాగా శుక్రవారం తెల్లవారుజామున అంజనాదేవి అస్వస్థతకు గురవడంతో కుటుంబసభ్యులు నగరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించినట్టు వార్తలు స్ప్రెడ్ అయ్యాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
దీంతో అలర్ట్ అయిన మెగాస్టార్ టీమ్.. అలాంటిదేమి లేదని, రెగ్యులర్ చెకప్‌లో భాగంగానే అంజనమ్మను ఆస్పత్రికి తీసుకెళ్లినట్టు స్పష్టం చేసింది. అనంతరం చిరంజీవి కూడా ఈ వార్తలపై సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ఈ సందర్భంగా ఎక్స్‌లో తనతోపాటు తల్లి అంజనాదేవి మరియు సోదరులు నాగబాబు, పవన్ కళ్యాణ్ ఉన్న ఫోటోను షేర్ చేశారు.
ఈ మేరకు చిరంజీవి.. “మా అమ్మకు అస్వస్థతగా ఉందని, ఆసుపత్రిలో చేరిందనే కొన్ని మీడియా కథనాలు నా దృష్టికి వచ్చాయి. గత రెండు రోజులుగా ఆమె కాస్త అస్వస్థతకు గురైందని స్పష్టం చేయాలన్నారు. ఆమె ఇప్పుడు పూర్తి ఆరోగ్యకరంగా ఉన్నారు. ఆమె ఆరోగ్యంపై ఎలాంటి ఊహాజనిత నివేదికలను ప్రచురించవద్దని అన్ని మీడియాలకు విజ్ఞప్తి. అర్ధం చేసుకుంటున్నందుకు ధన్యవాదాలు.” అని అందులో పేర్కొన్నారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: