యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన లేటెస్ట్ మ్యూజికల్ బ్లాక్ బస్టర్ ‘తండేల్’. చందూ మొండేటి దర్శకత్వంలో మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై ఫ్యాషనేట్ ప్రొడ్యూసర్ బన్నీ వాసు ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. భారీ అంచనాలతో ఫిబ్రవరి 7న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం అన్ని చోట్ల దుల్లగొట్టే రెస్పాన్స్‌తో బ్లాక్ బస్టర్ సక్సెని సొంతం చేసుకుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ప్రేక్షకులు, అభిమానులు, విమర్శకులు సినిమాపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించిన ‘తండేల్’ హౌస్ ఫుల్‌గా రన్ అవుతోంది. ప్రపంచవ్యాప్తంగా 100 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఓవర్సీస్ ఎర్నింగ్‌లో $1 మిలియన్ దాటింది. ఈ సందర్భంగా దర్శకుడు చందూ మొండేటి విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలల్ని పంచుకున్నారు.
ఈ సినిమా కథ అల్లు అర్జున్ గారి సిగ్నేచర్ కోసం మొదలైయిందని విన్నాం?
- పాక్ జైలులో ఒక సెంట్రి అల్లు అర్జున్ గారి ఫ్యాన్.
- వాళ్ళు మన తెలుగు సినిమాలు గట్టిగా చూస్తారు.
- 22 మంది మత్య్సకారులు ఈ ఇన్సిడెంట్ గురించి చెప్పారు.
ఇది బియోపిక్ అనుకోవచ్చా?
- లేదండీ. వాస్తవిక సంఘటనలతో కూడుకున్న కాల్పనిక ప్రేమకథ.
- ఇందులో ఇన్సిడెంట్ వాస్తవం.
- మత్య్సలేశ్యం నుంచి గుజరాత్ వెళ్ళడం అక్కడ నుంచి పాక్ సరిహద్దుల్లో దొరకడం, వారి కోసం పోరాటం.. ఇదంతా వాస్తవం.
- దానికి ఒక అందమైన ప్రేమకథ అల్లాం. అందుకే రియల్ పేర్లు పెట్టలేదు.
- మొదట ఈ కథ విన్నప్పుడు పాక్ నేపథ్యంలో చేద్దామని అనుకున్నాను.
- కానీ అలోచించి చూస్తే ఇందులో బ్యూటీఫుల్ ఎమోషన్ వుంది.
- ఈ ప్రేమకథలో ఎడబాటు, విరహం చాలా ప్రత్యేకం.
- ఇద్దరు ప్రేమికులు ఒక విషయాన్ని కమ్యునికేట్ చేయాలంటే నెల రోజులు ఆగాలి.
- ఈ పాయింట్ నాకు చాలా ఎక్సయిటింగ్‌గా అనిపించింది.
- అందుకే మెదట నుంచి ఈ సినిమా మేము ఎమోషనల్ లవ్ స్టొరీ అనే ప్రమోట్ చేశాం. ఇది ప్యూర్ లవ్ స్టొరీ.
పాక్ జైలు ఎపిసోడ్స్ ట్రిమ్ చేశారా?
- ఈ సినిమాఎంతసేపు చెబితే ఆడియన్స్‌కి కనెక్ట్ అవుతుందనే అంశంపై మా టీం అంతా చాలా క్లారిటీగా వున్నాం.
- కొంతమంది ఆడియన్స్ పాక్ ఎపిసోడ్ ఇంకా వుంటే బావుణ్ణనే ఫీలింగ్‌ని ఎక్స్‌ప్రెస్ చేశారు.
- ప్రతి ఎలిమెంట్‌కి ఆడియన్స్ చాలా కనెక్ట్ అయ్యారు.
చైతు గారితో తెనాలి రామకృష్ణుడు బయోపిక్ ఎనౌన్స్ చేశారు కదా.. ఏఎన్ఆర్ క్యారెక్టర్‌కి చైతు సరిపోతారని ఎప్పుడు అనిపించింది?
- చైతు గారు చాలా సిన్సియర్. ఆయన సినియర్‌గా ఎఫర్ట్ పెట్టారు కాబట్టే తండేల్ సక్సెస్‌కి మించిన ప్రశంసలు ఆయన నటనకి వస్తున్నాయి.
- తెనాలి రామకృష్ణుడు క్యారెక్టర్‌లో కూడా ఆయన అద్భుతంగా ట్రాన్స్ఫర్మేషన్ అవ్వగలరు.
- అలాంటి సినిమా ఆయన చేయాలని ఒక దర్శకుడిగా, స్నేహితుడిగా నా కోరిక.
తండేల్‌లో చైతు గారి ఎమోషనల్ సీన్స్ చేసేటప్పుడు మీ ప్రిపరేషన్ ఎలా వుండేది?
- ఇందులో ప్రతి షాట్ నా బ్రెయిన్‌లో వుంది. ప్రతిది ఓ కొలమానం లోనే చేశాను.
- పెళ్లి కార్డ్ సీన్‌లో కేవలం అతనికి మాత్రమే తెలిసేలా కళ్ళని చూపించాం.
- అక్కడ నుంచి ప్రతి షాట్ డిజైన్ చేశాం. ఆ సీన్‌కి థియేటర్ మొత్తం ఊగిపోయింది.
పాక్ ఎపిసోడ్స్‌కి సెన్సార్ సమస్యలు వచ్చాయా?
- చాలా వచ్చాయి. గ్లింప్స్‌లో జెండా చూపించడానికే ఒప్పుకోలేదు.
- డైలాగ్స్, మ్యుట్స్, విజువల్ కట్స్ చాలా వున్నాయి.
- ముఫ్ఫై శాతం ఎమోషన్ సెన్సార్ కారణంగా తగ్గింది.
- అయితే అది వారి డ్యూటీ. మా వరకు మా బెస్ట్ ఇచ్చాం.
అమరన్ తర్వాత సాయి పల్లవి పాత్రలో ఏమైనా మార్పులు చేశారా?
- లేదండీ, అప్పటికే షూటింగ్ అయిపొయింది.
- అయితే అమరన్‌లో సాయి పల్లవిని చూసిన తర్వాత నాకు ఇంకా ధైర్యం వచ్చింది.
మీ డైరెక్షన్‌లో నాగచైతన్య గారి ఫస్ట్ వందకోట్ల సినిమా ఇవ్వడం ఎలా అనిపిస్తుంది?
- ఇది గీతా ఆర్ట్స్. అరవింద్ గారు, వాసు గారు, చైతు గారు, దేవిశ్రీ .. ఇలా అంతా కలసి చేసిన కొలాబరేట్ ఎఫర్ట్.
- నా అక్షర రూపానికి వారంతా విజువల్ ని ఇచ్చారు.
- చైతు గారికి నేను అంటే చాలా ఇష్టం. మా మధ్య చాలా మంచి స్నేహం వుంది.
నాగార్జున గారు ఈ సక్సెస్‌ని చాలా ఎంజాయ్ చేయడం ఎలా అనిపించింది?
- నాగార్జున గారు కెరీర్‌లో ఎన్నో బ్లాక్ బస్టర్స్ చూశారు.
- ఆయన ‘థాంక్ యూ చందు. వి లవ్ యూ’ అని చెప్పడం ఆయన గొప్పదనం. అది నాకు గొప్ప ప్రశంస.
- ఈ సినిమా ఒక గౌరవం తీసుకొస్తుందని ముందు నుంచి నమ్మాం.
- ప్రేక్షకులు అంతే గౌరవంతో గొప్ప ఘన విజయాన్ని ఇచ్భారు.
దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ గురించి?
- ఈ కథని దేవిశ్రీ అర్ధం చేసుకున్నట్లుగా ఎవరూ అర్ధం చేసుకోలేదు.
- ప్రతి సీన్ మ్యూజిక్‌ని ఆయన ముందే ఊహించుకున్నారు.
- కథలోని ప్రతి ఎమోషన్‌పై ఆయనకి పట్టువుంది.
- పాటలల్ని ప్రేక్షకులు గొప్పగా ఆదరించారు.
- నేపథ్య సంగీతంతో ఆద్యంతం కట్టిపడేశారు.
సినిమా పైరసీ బారిన పడినప్పుడు ఎలా ఫీలయ్యారు?
- గుండెల్లో గునపంతో పొడిచినట్లనిపించింది. ఆ బాధ మాటల్లో చెప్పలేను.
- సినిమాని ఒక థియేటర్ ఎక్స్‌పీరియన్స్ కోసమే తీస్తాం.
- అలాంటిది పైరసీ బారిన పడటం చాలా బాధాకరం.
- మన పిల్లల్ని ఎవరో కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపొయినంత బాధగా ఉటుంది. చాలా పెయిన్ ఫుల్.
గీతా ఆర్ట్స్‌తో వర్క్ చేయడం ఎలా అనిపించింది?
- పెంటాస్టిక్ ఎక్స్‌పీరియన్స్.
- నెక్స్ట్ ప్రాజెక్ట్ చేసినప్పుడు అరవింద్ గారు లేకుండా ఎలా వుంటుంది? కథలో ప్రశ్నలు వేసే వారు ఎవరని ఫీలయ్యాను.
- మా మధ్య మంచి అండర్ స్టాండింగ్ వుంది.
ఈ సినిమాకి ఇండస్ట్రీ నుంచి ఎలాంటి కాంప్లిమెంట్స్ వచ్చాయి?
- చాలా మంది దర్శకులు, హీరోలు కాల్ చేశారు.
- నాని, రామ్ కాల్ చేసి డబుల్ బ్లాక్ బస్టర్.. ఎలా వుంది ఫీలింగ్ అన్నారు.
- ‘ఇది ఒక దర్శకుడి సినిమా’ అని రాఘవేంద్రరావు గారు చెప్పడం వెరీ మెమరబుల్.
నెక్స్ట్ ప్రాజెక్ట్స్ గురించి?
- ‘కార్తికేయ 3’ వుటుంది. మధ్యలో ఓ సినిమా వుంది.
- సూర్య గారితో చర్చలు జరుగుతున్నాయి. అది వర్క్ అవుట్ అవుతుందని ఆశిస్తున్నాను.
ఆల్ ది బెస్ట్..
థాంక్ యూ.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: