అఖండ 2: తాండవం లోకి స్టార్ నటుడి ఎంట్రీ

Actor Aadhi Pinisetty on Board For Nandamuri Balakrishna's Akhanda 2 Thandavam

గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, బ్లాక్ బస్టర్ మేకర్ బోయపాటి శ్రీను హైలీ యాంటిసిపేటెడ్ ‘అఖండ 2: తాండవం’ కోసం నాల్గవ సారి కొలాబరేట్ అయ్యారు. వారి మునుపటి బ్లాక్ బస్టర్ అఖండకు ఈ సీక్వెల్ యాక్షన్, ఇంటెన్స్ నెక్స్ట్ లెవల్ కి తీసుకెళ్లనుంది. 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట నిర్మించిన ఈ చిత్రాన్ని ఎం తేజస్విని నందమూరి సమర్పిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

బాలకృష్ణ పాత్రను మోఎస్ట్ డైనమిక్‌గా రూపొందించారు దర్శకుడు బోయపాటి. ఇక ఇదిలావుంటే, తాజాగా ఈ చిత్రంలోకి ఒక స్టార్ నటుడు ఎంట్రీ ఇచ్చారు. మోస్ట్ ట్యాలెంటెడ్ ఆది పినిశెట్టి తన కెరీర్‌లో ఒక ఎక్సయిటింగ్ చాపర్ట్ ని మార్క్ చేస్తూ, ఈ చిత్రంలో పవర్ ఫుల్ పాత్రను పోషించబోతున్నారు. సరైనోడు సినిమాలో ఆదిని ఇంటెన్స్ పాత్రలో చూపించిన దర్శకుడు బోయపాటి శ్రీనుతో ఆయన కలిసి చేస్తున్న రెండవ సినిమా ఇది.

అన్ని పాత్రలకు గొప్ప ప్రాముఖ్యత ఇవ్వడంలో పేరుపొందిన బోయపాటి, ఆది పాత్రను ఫెరోషియస్ గా రూపొందించారు. ఇది తన కెరీర్‌లో మోస్ట్ ఇంపాక్ట్ పాత్రలలో ఒకటిగా నిలుస్తుంది. ఆది ఈ మూవీలో కొత్త లుక్‌ లో కనిపించనున్నారు. బాలకృష్ణ, ఆది మధ్య జరిగే పేస్ అఫ్ అభిమానులకు ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లింగ్ విజువల్ ఫీస్ట్ అందించబోతోంది.

ప్రస్తుతం, ఈ సినిమా షూటింగ్ అన్నపూర్ణ 7 ఎకర్స్ లో ఆర్ట్ డైరెక్టర్ ఎఎస్ ప్రకాష్ నిర్మించిన గ్రాండ్ సెట్‌లో జరిగుతోంది, అక్కడ బ్రెత్ టేకింగ్ యాక్షన్ సీక్వెన్స్‌ను చిత్రీకరిస్తున్నారు. ఈ సీక్వెన్స్‌ను రామ్-లక్ష్మణ్ మాస్టర్స్ పర్యవేక్షిస్తున్నారు. బాలకృష్ణ, ఆది పినిశెట్టి ఇద్దరూ ఈ యాక్షన్-ప్యాక్డ్ షూట్‌లో పాల్గొంటున్నారు, వారి పెర్ఫార్మెన్స్ ప్రేక్షకులను తమ సీట్ల ఎడ్జ్ లో ఉంచుతాయి. ఈ సన్నివేశం సినిమాలోని మెయిన్ హైలైట్లలో ఒకటిగా ఉండనుంది.

భారీ బడ్జెట్‌తో భారీ స్థాయిలో రూపొందుతున్న ఈ సీక్వెల్‌లో సంయుక్త ఫీమేల్ లీడ్ గా కనిపించనుంది. సంగీత సంచలనం ఎస్ థమన్ మ్యూజిక్ అందిస్తున్నారు, సినిమాటోగ్రాఫర్ సి రాంప్రసాద్, ఎడిటర్ తమ్మిరాజు, ఆర్ట్ డైరెక్టర్ ఎఎస్ ప్రకాష్ వంటి అనుభవజ్ఞులైన సాంకేతిక నిపుణుల పని చేస్తున్నారు. కాగా ఈ చిత్రం దసరా పండుగ సందర్భంగా ఈ ఏడాది సెప్టెంబర్ 25న పాన్ ఇండియా లెవెల్లో గ్రాండ్ గా రిలీజ్ కానుంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.