గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన లేటెస్ట్ సూపర్ హిట్ ఫిల్మ్ ‘గేమ్ ఛేంజర్’. ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత చరణ్ సోలో హీరోగా వచ్చిన సినిమా కావడం, దీనికి ప్రముఖ తమిళ్ డైరెక్టర్ ఎస్. శంకర్ దర్శకత్వం వహించడంతో తొలినుంచే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో గత నెలలో సంక్రాంతి కానుకగా థియేటర్లలోకి వచ్చిన విషయం తెలిసిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అయిన ఈ పొలిటికల్ ఎంటర్‌టైనర్ ప్రేక్షకులను బాగానే అలరించింది. రామ్ చరణ్ ను సరికొత్తగా ఆవిష్కరించింది గేమ్ ఛేంజర్. సిన్సియర్ అధికారిగా, రాజకీయ పార్టీ నేతగా డ్యూయెల్ రోల్స్ లో చరణ్ అద్భుతమైన నటనను ప్రదర్శించాడు. కేవలం చరణ్ అభిమానులకే కాకుండా మూవీ లవర్స్ అందరినీ మెప్పించింది ఈ చిత్రం.
పొంగల్ బరిలో బాలకృష్ణ ‘డాకు మహారాజ్’, వెంకటేష్ ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాలు గట్టి పోటీ ఇచ్చినప్పటికీ బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లనే రాబట్టుకుంది గేమ్ ఛేంజర్. ఈ క్రమంలో తాజాగా ఈ చిత్రానికి సంబంధించి కీలక అప్డేట్ వచ్చింది. త్వరలో ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ డిజిటల్ ఎంట్రీ ఇవ్వబోతోంది.
అవును, గేమ్ ఛేంజర్ మరికొన్ని రోజుల్లోనే ఓటీటీ లోకి వచ్చేస్తోంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో ఈ సినిమా డిజిటల్ రైట్స్ ను భారీ ధరకు దక్కించుకుంది. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 7వ తేదీన ఈ చిత్రాన్ని స్ట్రీమింగ్ చేయనుంది. ఈ మేరకు సదరు ప్లాట్‌ఫామ్ సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించింది.
తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో గేమ్ ఛేంజర్ అందుబాటులో ఉండనుంది. సో, మూవీ లవర్స్ గెట్ రెడీ.. థియేటర్లలో ఈ సినిమాను మిస్ అయినవారు, అలాగే మరోసారి చూడాలనుకునేవారు ఇప్పుడు ఎంచక్కా ఇంట్లోనే కూర్చుని వీక్షించే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.
ఇక ఈ చిత్రంలో చరణ్ సరసన కియారా అద్వానీ కథానాయికగా నటించగా.. ఎస్.జె. సూర్య, శ్రీకాంత్, కిక్ శ్యామ్, సముద్రఖని, సునీల్, అంజలి తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించారు. తమన్ సంగీతం అందించగా.. శ్రీమతి అనిత సమర్పణలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్స్‌పై దిల్ రాజు, శిరీష్ భారీ బడ్జెట్‌తో నిర్మించారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: