BSS12 నుంచి బెల్లంకొండ సాయి శ్రీనివాస్ క్యారెక్టర్ పోస్టర్ రిలీజ్

Bellamkonda Sai Sreenivas Character Poster Unveiled From BSS12 on His Birthday

యాక్షన్-హల్క్ బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ #BSS12 35% షూటింగ్ పూర్తి చేసుకుంది. డెబ్యుటెంట్ లుధీర్ బైరెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మూన్‌షైన్ పిక్చర్స్ బ్యానర్‌పై మహేష్ చందు నిర్మిస్తున్నారు. శివన్ రామకృష్ణ సమర్పిస్తున్న #BSS12 బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కెరీర్‌లో హయ్యస్ట్ బడ్జెట్‌ మూవీగా నిలవనుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ నేపథ్యంలో నిన్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పుట్టినరోజు సందర్భంగా.. మేకర్స్ అతని క్యారెక్టర్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు, అతన్ని అడ్వంచర్ అవతార్‌లో ప్రెజెంట్ చేశారు. ఈ పోస్టర్ గమనిస్తే.. రెండు కాళ్లను సీటుపై పెట్టుకుని బైక్‌ను నడుపుతూ ధైర్యంగా దూసుకెలుతున్న లుక్ అదిరిపోయింది. బ్యాక్ గ్రౌండ్ మూమెంట్ ఇంటెన్సిటీ పెంచింది.

ఒక విశాలమైన లోయ, అతని వెనుక ఒక కొండపై విష్ణువు నామాలు కనిపించడం అద్భుతంగా వుంది. ఈ పవర్ ఫుల్ విజువల్ డేంజర్, అడ్వంచర్, డివైన్ ఎనర్జీని ప్రజెంట్ చేస్తోంది. బెల్లంకొండ అడ్వంచర్ స్టంట్స్ ఇంటెన్స్ యాక్షన్‌లతో కూడిన పాత్రను పోషిస్తున్నందున ప్రేక్షకులు మరపురాని సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్‌ని ఆశించవచ్చు.

ఈ ఒకల్ట్ థ్రిల్లర్ 400 ఏళ్ల నాటి దశావతార ఆలయం నేపధ్యంలో వుంటుంది. ఇందులో సంయుక్త ఫీమేల్ లీడ్‌గా నటిస్తున్నారు. ఇక ఈ చిత్రానికి టాప్ టెక్నిషియన్స్ పని చేస్తున్నారు. సినిమాటోగ్రాఫర్‌గా శివేంద్ర, లియోన్ జేమ్స్ సంగీతం, కార్తీక శ్రీనివాస్ ఆర్ ఎడిటింగ్, శ్రీనాగేంద్ర తంగాల ఆర్ట్ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.