శాండల్‌వుడ్ గోల్డెన్ స్టార్ గణేష్, తన లేటెస్ట్ మూవీ ‘కృష్ణం ప్రణయ సఖి’ ఇటీవల 100 రోజులు జరుపుకున్న థియేట్రికల్ బ్లాక్‌బస్టర్ విజయంతో దూసుకుపోతున్నాడు. ఇదే ఊపులో ఆయన తన అభిమానులకు మరో ఎక్సయిటింగ్ వార్తను అందించారు. గణేష్ అప్ కమింగ్ కన్నడ చిత్రం #PMF49 కోసం ప్రతిష్టాత్మకమైన తెలుగు నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీతో కోలాబరేట్ అయిన విషయం తెలిసిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
తెలుగులో ‘కార్తికేయ 2, వెంకీ మామ, ఓ బేబీ, ధమాకా’ వంటి బ్లాక్‌బస్టర్ హిట్‌లను అందించిన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ.. #PMF49తో, గణేష్ లీడ్ రోల్‌లో ప్రేక్షకులకు గొప్ప సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ అందించడానికి పూనుకున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ క్రేజీ ప్రాజెక్టు టైటిల్ టీజర్ రిలీజ్ చేశారు. ఈ టీజర్ అయితే స్మశానం బ్యాక్‌గ్రౌండ్‌లో భయం గొలిపేలా రూపొందించారు. హీరో గణేష్ కపాలాలతో చేసిన సింహాసనంపై కూర్చుని క్షుద్రమాంత్రికుడిగా అదరగొట్టేసాడు.
గోల్డెన్ స్టార్ గణేష్ క్షుద్ర, రుద్ర గా స్టన్నింగ్ న్యూ అవాతార్‌లో తన వెర్సటాలిటీ చూపించబోతున్నారు. ఈ మూవీ గోల్డెన్ స్టార్ గణేష్ కెరీర్‌లో ఒక టర్నింగ్ పాయింట్‌గా నిలవనుంది. ఛాలెంజింగ్ రోల్స్ చేయడంలో అతని వెర్సటాలిటీని ప్రజెంట్ చేస్తోంది. మొత్తానికి మరిచిపోలేని సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్‌ని ఇస్తూ టీజర్ గ్రేట్ ఎక్సయిట్మెంట్‌ని క్రియేట్ చేసింది.
కన్నడ సినిమాలో మునుపెన్నడూ లేనివిధంగా గ్రిప్పింగ్ స్టోరీ లైన్, అద్భుతమైన విజువల్స్, బ్లాక్ మ్యాజిక్ ఎలిమెంట్స్‌తో కూడిన గ్రాండ్ పీరియాడిక్ డ్రామాని టీజర్ పరిచయం చేసింది. బ్రెత్ టేకింగ్ వీఎఫ్ఎక్స్, అడ్వాన్స్ విజువల్స్‌తో ‘పినాక’ న్యూ ఎక్సయిటింగ్ వరల్డ్‌ని ప్రజెంట్ చేసింది. రాంపేజ్ ఆఫ్ క్షుద్ర పోస్టర్ హ్యుజ్ బజ్ క్రియేట్ చేసింది.
ఈ టైటిల్ టీజర్‌తో నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్ నేతృత్వంలోని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ హై క్యాలిటీ స్టొరీ టెల్లింగ్, అత్యాధునిక నిర్మాణం ద్వారా కన్నడ సినిమాను మరో లెవల్‌కి తీసుకువెళ్ళడానికి సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్ కన్నడ సినిమా అపారమైన సామర్థ్యాన్ని ఒక బిగ్ స్టేజ్‌పై ప్రెజెంట్ చేయాలనే వారి లక్ష్యాన్ని తెలియజేస్తోంది.
మొత్తానికి ఈ టైటిల్ టీజర్ సినిమాపై అంచనాలను ఒక్కసారిగా పెంచేసింది. ఇక ఈ క్రేజీ ప్రాజెక్ట్ కోసం పేరొందిన టెక్నిషియన్స్ పనిచేస్తున్నారు. ప్రముఖ కొరియోగ్రాఫర్ బి. ధనంజయ దర్శకుడిగా పరిచయం కాబోతున్న ఈ చిత్రం యూనిక్ అండ్ లార్జ్ దెన్ లైఫ్ స్టొరీగా వుండబోతోంది. కాగా ఈ సినిమాలో నటించనున్న ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో మేకర్స్ తెలియజేయనున్నారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: