వైవిధ్యభరితమైన చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తూ, వరుస భారీ విజయాలతో దూసుకుపోతున్న గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, ఈ సంక్రాంతికి మరో వైవిధ్యభరితమైన చిత్రం ‘డాకు మహారాజ్’తో అలరించడానికి సిద్ధమవుతున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి బ్లాక్ బస్టర్ దర్శకుడు బాబీ కొల్లి దర్శకత్వం వహిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
బాలకృష్ణ మునుపెన్నడూ చూడని సరికొత్త అవతారంలో కనిపిస్తున్న ‘డాకు మహారాజ్’పై అంచనాలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, టైటిల్ టీజర్ విశేషంగా ఆకట్టుకున్నాయి. తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం నుంచి, ఇటీవల విడుదలైన మొదటి గీతం ‘ది రేజ్ ఆఫ్ డాకు’, రెండవ గీతం ‘చిన్ని’కి అద్భుతమైన స్పందన లభించింది.
బాలకృష్ణ, తమన్ కలయిక అంటే పాటలపై సంగీత ప్రియుల్లో అంచనాలు ఉండటం సహజం. ఆ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ‘డాకు మహారాజ్’కి తమన్ అద్భుతమైన సంగీతం అందించారని ఈ రెండు సాంగ్స్ తోనే అర్థమైంది. ఫస్ట్ సాంగ్ హీరో నైజం గురించి చెప్తే.. సెకండ్ సాంగ్ చిన్ని పాటకు తమన్ అందించిన సంగీతం హృద్యంగా ఉంది. మనసుకి హత్తుకునే ఆ సంగీతానికి తగ్గట్టుగా అనంత శ్రీరామ్ అందించిన సాహిత్యం పాటకు మరింత అందం తీసుకొచ్చింది.
ఈ నేపథ్యంలో మేకర్స్ తాజాగా ఈ మూవీ థర్డ్ సింగిల్ అప్‌డేట్ ఇచ్చారు. త్వరలోనే ఈ మూడో పాటను విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు. రానున్న జనవరి 4, 5 తేదీలలో అమెరికా మరియు ఇండియాలో భారీ ఈవెంట్స్ నిర్వహించనుంది చిత్ర యూనిట్. ఈ సందర్భంగానే డాకు మహారాజ్ థర్డ్ సింగిల్ రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
‘డాకు మహారాజ్’ చిత్రంలో ప్రముఖ బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ తో పాటు ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్, చాందిని చౌదరి, ఊర్వశి రౌతేలా తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. కాగా ఈ చిత్రానికి ప్రముఖ ఛాయాగ్రాహకుడు విజయ్ కార్తీక్ కన్నన్ కెమెరా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కళా దర్శకుడిగా అవినాష్ కొల్లా, ఎడిటర్‌గా నిరంజన్ దేవరమానే వ్యవహరిస్తున్నారు.
ఇక డాకు మహారాజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ యూఎస్‌ఏలో ప్లాన్ చేశారు మేకర్స్. అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రం లోని డల్లాస్ నగరంలో వచ్చే జనవరి 4న సాయంత్రం 6 గంటల నుంచి ఈవెంట్ జరుగనుంది. Texas Trust CU Theatre ఈవెంట్‌కు వేదిక కానుంది. ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్‌ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పిస్తోంది. సంక్రాంతి కానుకగా 2025, జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల కానుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్



మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























