కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర ఫోకస్డ్ బ్లాక్ బస్టర్ ‘UI ది మూవీ’. లీడ్ యాక్టర్‌గా, దర్శకుడిగా, ఉపేంద్ర అద్భుతమైన క్రియేటివిటీతో విజువల్ వండర్‌గా సినిమాని తీర్చిదిద్దారు. లహరి ఫిల్మ్స్, జి మనోహరన్ & వీనస్ ఎంటర్‌టైనర్స్ కెపి శ్రీకాంత్ ఈ చిత్రాన్ని హై బడ్జెట్‌తో నిర్మించారు. నవీన్ మనోహరన్ సహా నిర్మాత. గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్ ఈ చిత్రాన్ని తెలుగులో గ్రాండ్‌గా రిలీజ్ చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
డిసెంబర్ 20 న విడుదలైన ఈ చిత్రం అందరినీ అలరించి ఘన విజయం సాధించి అన్ని చోట్ల సక్సెస్ ఫుల్‌గా రన్ అవుతోంది. తెలుగు, కన్నడలో ఫస్ట్ డే కంటే సెకండ్ డే, సెకండ్ డే కంటే థర్డ్ డే కలెక్షన్స్ పెరిగాయి. బుక్ మై షోలో 400K టికెట్స్ బుక్ అయ్యాయి. కన్నడ సినిమాలో ఈ ఏడాది వన్ అఫ్ ది బెస్ట్ ఓపెనింగ్ మూవీగా UI నిలిచింది. తెలుగు కూడా బుకింగ్స్ అద్భుతంగా వున్నాయి. సినిమా సక్సెస్ టూర్‌లో భాగంగా విజయవాడలో సక్సెస్ ప్రెస్ మీట్ నిర్వహించారు మేకర్స్.
ఈ సందర్భంగా హీరో ఉపేంద్ర మాట్లాడుతూ.. “నేను అరుదుగా డైరెక్షన్ చేస్తాను. ఇరవై ఏళ్ల క్రితం చేసిన ఏ, ఉపేంద్ర సినిమాలని మీరు ఇంకా గుర్తుపెట్టుకొని అభిమానించారు. అంతే అభిమానం ఇప్పుడు యూఐ సినిమాపై చూపించడం చాలా ఆనందంగా వుంది. నన్ను ఇంతగా ఆదరిస్తున్న తెలుగు ప్రేక్షకులు ధన్యవాదాలు. ఇది డిఫరెంట్ ఫిల్మ్. ఆడియన్స్ ఈ సినిమాకి స్టార్స్.” అని పేర్కొన్నారు.
ఇంకా ఆయన మాట్లాడూతూ.. “మీపై నమ్మకంతో సినిమా చేశాను. మీ అందరికి కనెక్ట్ అవ్వడం ఆనందంగా వుంది. మీ ఆదరణ చూస్తుంటే రెగ్యులర్‌గా నా డైరెక్షన్‌లో సినిమాలు చేయాలనే ఉత్సాహం కలుగుతోంది. ఆడియన్స్ చాలా గొప్ప ఇన్వాల్వ్ అయి సినిమా చూడటం చాలా థ్రిల్ ఇస్తోంది. తప్పకుండా అందరూ సినిమా చూడండి. ఇందులో రియల్ స్టార్స్ ఆడియన్సే” అని అన్నారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: