రీరిలీజ్‌ అవుతోన్న ఓయ్, నేనింతే

Oy and Neninthe Movies Ready For Rerelease

కొత్త సంవత్సరంలో సంక్రాంతి కానుకగా మూడు భారీ బడ్జెట్ చిత్రాలు ప్రేక్షకులముందుకు వస్తోన్న విషయం తెలిసిందే. రామ్ చరణ్-శంకర్ కాంబోలో వస్తోన్న ‘గేమ్ ఛేంజర్’, బాలకృష్ణ-బాబీ కాంబోలో ‘డాకు మహారాజ్’, వెంకటేష్-అనిల్ రావిపూడి కాంబోలోని ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాలు పండుగ బరిలో పోటీపడుతున్నాయి. దీంతో మూవీ లవర్స్ ఈసారి పొంగల్ హాలిడేస్ కోసం ఎంతో ఉత్సుకతగా ఎదురుచూస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ నేపథ్యంలో తాజాగా వారికి మరో గుడ్ న్యూస్ అందింది. కొత్త ఏడాది ప్రారంభం లోనే మరో రెండు సినిమాలు అలరించడానికి సిద్ధమయ్యాయి. అయితే ఇవి కొత్త చిత్రాలు కాదు. ఆల్రెడీ వచ్చినవే, కానీ మళ్ళీ రిలీజ్ కాబోతున్నాయి. అవేంటంటే.. సిద్దార్థ్-షామిలి జంటగా వచ్చిన ‘ఓయ్’ మరియు మాస్ మహారాజా ర‌వితేజ, బ్లాక్ బస్టర్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ కాంబినేష‌న్‌లో వ‌చ్చిన ‘నేనింతే’.

2025 జనవరిలోనే ఈ మూవీస్ రీరిలీజ్ కానున్నాయి. ఈ మేరకు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఓయ్ జనవరి 1న ప్రేక్షకుల ముందుకు వస్తోంటే.. నేనింతే రిపబ్లిక్ డే కానుకగా జనవరి 26న థియేటర్లలోకి వస్తోంది. గత కొన్నేళ్లుగా తెలుగునాట రీరిలీజ్‌ల ట్రెండ్ కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. ఇదేక్రమంలో ఈ సినిమాలు దాదాపు ఒకటిన్నర దశాబ్దం తర్వాత మరోసారి ప్రేక్షకులను అలరించనున్నాయి.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.