రజినీకాంత్‌కి నేను ఏకలవ్య శిష్యుడిని

Real Star Upendra Says I am Ekalavya Shishya of Superstar Rajinikanth

కన్నడ రియల్ స్టార్ ఉపేంద్ర మచ్- ఎవైటెడ్ ఫ్యూచరిస్టిక్ ఎక్సట్రావగంజా ‘యూఐ’ మూవీతో అలరించడానికి సిద్ధంగా వున్నారు. పాన్ ఇండియా లెవెల్లో రూపొందుతోన్న ఈ సినిమాకు ఉపేంద్ర కథ అందించగా.. లహరి ఫిలిమ్స్‌, వీనస్‌ ఎంటర్‌టైనర్స్‌పై మనోహరన్-శ్రీకాంత్‌ కేపి సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు. రీష్మా నానయ్య ఫీ మేల్ లీడ్ రోల్‌లో నటిస్తుండగా.. నిధి సుబ్బయ్య, మురళీశర్మ, పి. రవిశంకర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

నవీన్ మనోహరన్ సహా నిర్మాత. గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్ ఈ చిత్రాన్ని తెలుగులో గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు. వార్నర్ పేరుతో రిలీజ్ చేసిన స్పెషల్ వీడియో మరియు ఇతర సెన్సేషనల్ ప్రమోషనల్ కంటెంట్‌తో హ్యూజ్ బజ్‌ని క్రియేట్ చేసింది. డిసెంబర్ 20న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సందర్భంగా సూపర్ స్టార్ ఉపేంద్ర విలేకరుల సమావేశంలో సినిమా విశేషాల్ని పంచుకున్నారు.

‘UI’ కాన్సెప్ట్, ఐడియా ఎలా మొదలైంది?

  • మన ఎడ్యుకేషన్ సిస్టం లో ఏ ఫర్ ఆపిల్.. బి ఫర్ బ్యాట్.. ఇలా నేర్పించారు.
  • వాళ్లు ఏం చెప్తే అది బైహాడ్ చేసుకుని దాన్నే నేర్చుకున్నాం.
  • అదొక సిస్టంలాగా మారిపోయింది.
  • దీనివలన మన థింకింగ్ కెపాసిటీ తగ్గిపోయింది.
  • అప్పుడే ఏ ఫర్ ఆపిల్‌తో ఇంకొన్ని వర్డ్స్ చెప్పుంటే మన ఆలోచన మరోలా ఉండేది.
  • నా కథల్లో కూడా అలాంటి ఏదైనా ఒక కొత్త ఆలోచననే చెప్పాలనే ప్రయత్నం చేస్తుంటాను.
  • UI ఆలోచన కూడా అలా వచ్చినదే.
  • యూ అండ్ ఐ… మీలోనూ నాలోను ఒకటే కథ ఉంది.
  • నేను ఆలోచిస్తున్నట్టుగానే మీరు ఆలోచిస్తున్నారా? అని..
  • క్రాస్ చెక్ చేసుకున్నప్పుడు మన ఆలోచనలన్నీ ఒకేలా ఉన్నాయి.
  • నేను ఫీల్ అవుతున్నాదే మీరూ ఫీల్ చేస్తున్నారు.
  • ఇది ఆడియన్స్‌తో ఇంటరాక్టివ్ అయ్యే సినిమా.
  • చూస్తున్నప్పుడు ప్రేక్షకులే చాలా విషయాల్ని డీకోడ్ చేస్తారు.
  • ఈ సినిమాని మెటాఫరికల్ చేశాం.
  • నా వరకు థియేటర్లో కూర్చుని సినిమా చూసిన ఆడియన్స్ అసలైన స్టార్స్.
  • నా మొదటి సినిమాతోనే దాన్ని కన్ఫర్మ్ చేసుకున్నాను.
  • ఆడియన్స్ ఒక ఫిలిం మేకర్ కంటే పైనే ఉంటారు.
  • ఈ సినిమాతో ఆడియన్స్ ఇంటరాక్ట్ అవుతారు.

అమీర్ ఖాన్ ని కూడా మీ సినిమా కదిలించింది కదా?

  • అమీర్ ఖాన్ గారు చాలా బిగ్ స్టార్.
  • ఆయనకి మా సినిమా నచ్చడం చాలా ఆనందంగా ఉంది.
  • అదంతా ఆయన గొప్పతనం.
  • ఆయన సినిమా గురించి మాట్లాడారు.
  • అది మాకు చాలా హెల్ప్ అయింది.

మీ సినిమాల్లో ఒక ఆవేశం ఉంటుంది. అలాంటి కథలు చెప్పాలనే ధైర్యం మీకు ఎలా వచ్చింది?

  • ఏమో నాకే తెలియదండి.
  • నాకు చెప్పాలనిపించింది సినిమా ద్వారా చెప్పేస్తాను.
  • ఏంజెల్స్ వెళ్లడానికి భయపడే దారిలో.. ఒక పూల్ వెళ్తాడని సామెత ఉంది.
  • బహుశా ఆ గట్ ఫీలింగ్‌తో వెళ్తున్నానేమో (నవ్వుతూ).
  • ఇదంతా ఆడియన్స్ గొప్పతనం గానే భావిస్తాను.
  • నా సినిమాలన్నింటి గురించి చాలా చక్కగా డీకోడ్ చేసి అంతాలా గుర్తుపెట్టుకోవడం చాలా ఆనందాన్నిస్తుంది.

ఈ సినిమా వార్నర్ వీడియోలో కల్కి లాంటి కాంప్లెక్స్ కనిపించింది.. దాని గురించి చెప్పండి?

  • అందులో మైథిలాజికల్ కల్కి చూశారు.
  • ఇందులో సైకలాజికల్ కల్కి చూస్తారు (నవ్వుతూ).

మీ క్యారెక్టర్ చాలా కొత్తగా ఉంది. లుక్ పరంగా ఎలాంటి కేర్ తీసుకున్నారు?

  • నిజానికి లుక్ విషయంలో ఇందులో చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది.
  • ఏడాది స్క్రిప్ట్‌కి పడితే మరో ఏడాది లుక్, క్యారెక్టర్ డిజైన్‌కే పడుతుంది.

యూఐ టెక్నికల్ వాల్యూస్ గురించి?

  • ఆర్ట్ డైరెక్టర్ శివకుమార్ ఒక సర్రియల్ వరల్డ్ క్రియేట్ చేశారు.
  • చాలా డిఫరెంట్ సెట్స్ డిజైన్ చేశాం.
  • ఇందులో ఉండే సెట్స్ మొదట్లో చూసినప్పుడు చాలా విచిత్రంగా ఉంటాయి.
  • తర్వాత డీకోడ్ చేసినప్పుడు దాని వెనుక ఉన్న మీనింగ్ అర్థం అవుతుంది.
  • అజనీష్ లోక్‌నాథ్ మ్యూజిక్ ఈ సినిమాకి బిగ్ ప్లస్ పాయింట్.
  • తను పాన్ ఇండియా మోస్ట్ సక్సెస్‌ఫుల్‌ మ్యూజిక్ డైరెక్టర్.
  • నాకు చాలా టైం ఇచ్చి చాలా వండర్‌ఫుల్ మ్యూజిక్ ఇచ్చారు.
  • హంగేరీలో రికార్డింగ్ చేసాము. చాలా వండర్‌ఫుల్‌గా వచ్చింది.

సినిమా రన్ టైం గురించి?

  • 2 గంటల 10 నిముషాలు ఉంటుంది.
  • నాకు ఏదైనా విషయాన్ని లాగ్ చేసి చెప్పడం ఇష్టం ఉండదు.
  • సినిమా చాలా ఫాస్ట్ గా ఉంటుంది.

సన్నాఫ్ సత్యమూర్తి తర్వాత తెలుగులో మళ్లీ సినిమా చేయకపోవడానికి కారణం?

  • అల్లు అర్జున్ నా ఫేవరెట్ యాక్టర్. నేను ఆయనకి ఫ్యాన్‌ని.
  • అలాగే త్రివిక్రమ్ గారు చాలా ఇష్టం.
  • ఆ ఇద్దరు కాంబినేషన్‌లో సన్ ఆఫ్ సత్యమూర్తి చేయడం చాలా ఆనందాన్నిచ్చింది.
  • ఆ సినిమా తర్వాత కూడా కొన్ని కథలు వచ్చాయి.
  • అయితే నా మూవీ వర్క్స్ ఉండడం వల్ల చేయడం కుదరలేదు.

మీ సినిమాలకి సీక్వెల్స్ చేసే ఆలోచన ఉందా?

  • లేదండి. నా కథలకు పార్ట్ 2 చేసే ఆలోచన నాకు రాదు.
  • ఇంకా ఏమైనా కొత్త కథలు చెప్పాలని ఉంటుంది.
  • ఈ సినిమా చూసిన తర్వాత ఆడియన్స్ దీనికి రెండో పార్ట్ కూడా చేయాలని అంటే అప్పుడు ఆలోచిస్తాను (నవ్వుతూ).

మీ కథల్లో బాధ పెట్టే వాళ్ళ కంటే బాధపడే వాళ్ళని ఎక్కువ క్వశ్చన్ చేస్తారు? దాని గురించి చెప్పండి?

  • మీరన్నది కరెక్టే. మనం ఎక్కువగా ప్రాబ్లం గురించే మాట్లాడుతాం.
  • సొల్యూషన్ గురించి ఎవరు మాట్లాడరు.
  • ఎందుకంటే సొల్యూషన్ ఇవ్వడం చాలా డిఫికల్ట్.
  • ఈ విషయంలో కొంచెం ట్రై చేస్తాను.
  • సొల్యూషన్ ఇక్కడే ఉంది దాని గురించి ఆలోచించండి అని చెప్పడానికి ప్రయత్నిస్తాను.
  • అది కొంతమందికి అర్థమవుతుంది.
  • కొంతమంది జాలీగా సినిమా చూసి వెళ్లిపోతారు.

మీ సినిమాలన్నీ చాలా డిఫరెంట్ కాన్సెప్ట్స్‌తో ఉంటాయి కదా.. సెన్సార్‌లో ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటారు?

  • ‘ ఓం’ సినిమాకి చాలా ప్రాబ్లమ్ అయింది.
  • తర్వాత నా ‘ఏ’ సినిమా చూసి దిస్ ఫిల్మ్ ఈజ్ అన్ ఫిట్ ఫర్ రిలీజ్ అని వెళ్ళిపోయారు.
  • తర్వాత రివైజ్ కమిటీలో ఎక్స్‌ట్రార్థినరీగా ఉందని సర్టిఫికెట్ ఇచ్చారు.
  • నా కథలు, స్క్రీన్ ప్లే డిఫరెంట్‌గా ఉంటాయి.
  • బహుశా అందుకే అలా రియాక్ట్ అయి ఉంటారని భావించాను.
  • ఈ సినిమా వరకు ఎలాంటి కట్స్ లేకుండా ఇచ్చారు.

ప్రేక్షకుల్ని ఆలోచింపజేసే సినిమాలు తీయాలనేది మీ ఉద్దేశమా?

  • లేదండి. సినిమా అనేది ఎప్పుడూ కూడా ఎంటర్టైన్మెంట్ మీడియా.
  • ఆడియన్స్ ఎంటర్‌టైన్‌మెంట్ కోసం సినిమాకి వస్తారు.
  • ఎంటర్‌టైన్‌మెంట్ కమర్షియల్ ఎలిమెంట్స్ అన్నీ ఉండాలి.
  • ఈ సినిమాలో కూడా సాంగ్స్ ఫైట్స్ మంచి మ్యూజిక్ విజువల్ గ్రాండియర్ అన్ని ఉన్నాయి.
  • నార్మల్ గా చూసినప్పుడు ఒక మంచి సినిమా లాగా ఉంటుంది.
  • కొంచెం డీప్ గా వెళ్తే ఇంకొక లేయర్ కనిపిస్తుంది.
  • ఇంకా డెప్త్‌లో చూస్తే ఒక పొలిటికల్ యాంగిల్ కనిపిస్తుంది.
  • ఇంకా లోతుగా వెళ్తే ఫిలాసఫికల్ యాంగిల్ కనిపిస్తుంది.
  • అన్ని ట్రై చేశాను. ఆడియన్స్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.

ఒక ఫిలిం మేకర్‌గా ఏదైనా మార్పు చేయాలని ఆలోచన ఉంటుందా?

  • మార్చడానికి నేను ఎవరిని? నన్ను నేనే మార్చుకోలేకపోతుంటాను.
  • నేను మెసేజ్ ఇవ్వను. తీసుకోను.
  • ఈ సినిమాలో కూడా అదే చెప్పాను (నవ్వుతూ).

ఒకప్పటికి ఇప్పటికీ ఫిలిం టెక్నాలజీలో ఎలాంటి మార్పు వచ్చింది?

  • చాలా మార్పు వచ్చిందండి.
  • ఇప్పుడు ఒక రూమ్‌లో కూర్చుని ఒక ఫిలిం తయారు చేయొచ్చు.
  • అయితే టెక్నాలజీని ఎలా వాడుతున్నాం అనేదాని మీదే అంత డిపెండ్ అయి ఉంటుంది.

మీ పోస్టర్స్ చాలా యూనిక్‌గా ఉంటాయి దాని గురించి చెప్పండి?

  • నాగభూషణ్ అనే ఆర్టిస్ట్ చేస్తారు.
  • సర్రిలిక్‌గా డిజైన్ చేయడం నాకు ఇష్టం.
  • ఈ టైటిల్ కూడా ఆడియన్స్ సినిమా చూసిన తర్వాత డీకోడ్ చేసేస్తారు.

నిర్మాతల గురించి?

  • అందరూ కెప్టెన్ అఫ్ ది షిప్ ఇంపార్టెంట్ అంటారు.
  • నేను మాత్రం ఓనర్ ఆఫ్ ది షిప్ ఇంపార్టెంట్ అని అంటాను (నవ్వుతూ).
  • ఈ సినిమాకి ఇంత పెద్ద స్కేల్‌లో ఖర్చు పెట్టి తీశారు అంటే ఆ క్రెడిట్ అంతా నిర్మాతలకే దక్కుతుంది.
  • నిర్మాతలు పర్సనల్ ఇంట్రెస్ట్ తీసుకుని తీశారు. చాలా సపోర్ట్ ఇచ్చారు.
  • సినిమాకి ఆర్టిస్టులు, టెక్నీషియన్లు, అందరి కాంట్రిబ్యూషన్ ఉంది. అంతా టీం వర్క్.

రజనీకాంత్ గారితో కూలీ సినిమా చేస్తున్నారు కదా.. ఎలా అనిపించింది?

  • ఆయనతో వర్క్ చేయడం నా లైఫ్ డ్రీమ్.
  • నేను ఆయనకి ఏకలవ్య శిష్యుడిని.
  • ఆయనతో సినిమా చేయడం వండర్‌ఫుల్ ఎక్స్‌పీరియన్స్.

ఆల్ ది బెస్ట్..

థాంక్ యూ.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.