పుష్ప 2.. ఇప్పుడు 3డీలో కూడా

Pushpa 2 The Rule 3D Version Now Available Across India

ఐకాన్‌స్టార్‌ అల్లు అర్జున్‌, బ్రిలియంట్‌ దర్శకుడు సుకుమార్‌ల లేటెస్ట్ ఫిల్మ్ ‘పుష్ప-2 ది రూల్‌’. మైత్రీ మూవీమేకర్స్‌, సుకుమార్‌ రైటింగ్‌ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా బిగ్గెస్ట్‌ బ్లాక్‌బస్టర్‌ అనిపించుకుంది. విడుదలకు ముందే ప్రీరిలీజ్‌ బిజినెస్‌లో ఇండియాలో సరికొత్త రికార్డును నెలకొల్పిన ఈ చిత్రం రిలీజ్ రోజు నుంచే వసూళ్లలో ఇండియా ఆల్‌టైమ్‌ రికార్డులు సృష్టిస్తోంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ముఖ్యంగా ఇండియాలో ఈ చిత్రం సృష్టించిన రికార్డుల పరంపరకు ఆకాశమే హద్దుగా ఉంది. ఈ క్రమంలో కేవలం ఆరు రోజుల్లోనే రూ.1,000 కోట్లు వసూలు ఇండియన్‌ సినిమా చరిత్రలోనే అత్యంత వేగవంతంగా ఈ మార్క్ అందుకున్న తొలి చిత్రంగా సరికొత్త రికార్డును నెలకొల్పింది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ క్రేజీ అప్డేట్ అందించింది.

పుష్ప 2 చిత్రం ఇప్పుడు 3డీలో కూడా అందుబాటులోకి వచ్చేసింది. ఈ మేరకు దేశవ్యాప్తంగా అనేకచోట్ల మరియు హైదరాబాద్‌లో సెలెక్ట్ స్క్రీన్‌లలో ఈ మూవీ 3డీ ప్రదర్శితమవుతున్నట్టు మేకర్స్ సోషల్ మీడియా వేదికగా తెలిపారు. ఇప్పటికే 1,300 కోట్లు కలెక్ట్ చేసిన ఈ సినిమా ఇప్పుడు 3డీలో కూడా అందుబాటులోకి వచ్చేయడంతో వసూళ్లు మరింత పెరిగే ఛాన్స్ ఉంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.