విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతోన్న ‘కన్నప్ప’ నుంచి ప్రతీ సోమవారం ఒక అప్‌డేట్ వస్తున్న విషయం తెలిసిందే. దీనిలో భాగంగా సినిమాలోని ప్రతీ పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేసి బజ్ పెంచేస్తున్నారు మేకర్స్. ఇప్పటికే కన్నప్ప టీజర్‌తో సినిమా మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి. కాగా ఈ చిత్రంలో అక్షయ్ కుమార్ శివుడి పాత్రలో కనిపించనున్న సంగతి తెలిసిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇప్పటి వరకు బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్, శరత్ కుమార్, మధుబాల, దేవరాజ్, ముఖేష్ రిషి, మంచు అవ్రామ్, అర్పిత్ రంకా, బ్రహ్మానందం, మోహన్‌బాబు పాత్రలకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్లను రిలీజ్ చేశారు. అలాగే ఈ చిత్రంలో తిన్నడికి విధేయుడైన స్నేహితుడు.. టిక్కి (గుర్రం)ని ఇటీవలే పరిచయం చేశారు హీరో విష్ణు.
అలాగే కన్నప్పలో హీరో విష్ణు మంచు కుమార్తెలు అరియానా మరియు వివియానా కూడా నటిస్తున్నారు. దీనిని ఖరారు చేస్తూ నేడు వీరిద్దరి ఫస్ట్ లుక్ రివీల్ చేసింది చిత్ర యూనిట్. కాగా విష్ణు మంచు తనయుడు అవ్రామ్ భక్త మంచు కూడా నటిస్తున్నాడు. తను తిన్నడు పాత్రతో వెండితెరపైకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు.
ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా నుండి మరో కీలక అప్‌డేట్ అందించింది చిత్ర బృందం. నటుడు మోహన్ లాల్ ఫస్ట్ లుక్ రివీల్ చేసింది. కన్నప్పలో ఆయన ‘కిరాత’ అనే పాత్రలో నటించనున్నట్టు తెలిపింది. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్‌లో మోహన్ లాల్ ఆటవికునిగా రూత్ లెస్ క్యారక్టర్‌లో కనిపిస్తున్నారు.
ఈ వరుస అప్డేట్స్ మూవీపై మంచి హైప్ క్రియేట్ చేశాయి. దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన భాషలకు చెందిన ప్రముఖ నటీనటులు కన్నప్పలో నటిస్తున్న విషయం తెలిసిందే. భారీ బడ్జెట్‌తో నిర్మితమవుతున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ఏప్రిల్ 25న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు మేకర్స్. విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్టుగా తెరకెక్కుతోన్న కన్నప్ప మూవీపై భారీ అంచనాలే ఉన్నాయి.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: