గేమ్ ఛేంజర్.. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎక్కువగా వినిపిస్తున్న పదం. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఎస్. శంకర్ తెరకెక్కిస్తున్న పొలిటికల్ ఎంటర్‌టైనర్ ‘గేమ్ ఛేంజర్’. కియారా అద్వాణీ హీరోయిన్ గా నటిస్తుండగా.. ఎస్.జె. సూర్య, శ్రీకాంత్, సముద్రఖని, వెన్నెల కిశోర్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది జనవరి 10న సంక్రాంతి కానుకగా ఈ చిత్రం పాన్ ఇండియా లెవెల్లో గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. ఈ నేపథ్యంలో అసలు గేమ్ ఛేంజర్ అంటే అర్ధం ఏంటి? ఎవరిని ఆ పేరుతో పిలుస్తారు? అనే విషయాలు ఇప్పుడు చూద్దాం..
సాధారణంగా గేమ్ ఛేంజర్ అంటే.. ఆట తీరును మార్చేసేవాడు అని అర్ధం. ఉదాహరణకు ఏదయినా ఒక గేమ్ ఓడిపోయే స్థితిలో ఉన్నప్పుడు, తన డేరింగ్ ఆటతో ఒక్కసారిగా గేమ్ స్వరూపాన్నే మార్చేయగలవాడిని, గెలవడం అసాధ్యం అనుకున్న స్థితినుంచి సంచలన విజయం సాధించే దిశగా పోరాడేవాడిని గేమ్ ఛేంజర్ అని అనొచ్చు.
ఈ ఉపమానానికి సరిగ్గా సరిపోతారు టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు అలియాస్ వి.వెంకట రమణా రెడ్డి గారు. తెలుగు చిత్ర పరిశ్రమలో ఆయనను రియల్ గేమ్ ఛేంజర్ అని చెప్పొచ్చు. ఇండస్ట్రీలో ఎంతోమంది నిర్మాతలు ఉన్నా.. ప్రస్తుత జెనరేషన్‌లో నెం.1 ప్రొడ్యూసర్ అంటే రాజు గారే. హిట్స్, ఫ్లాప్స్ వంటి వాటితో సంబంధం లేకుండా వరుసగా చిత్రాలను నిర్మించడం రాజు గారి ప్రత్యేకత.
ఒక సినిమా రిలీజ్ అయ్యే సమయానికి మరో 2, 3 చిత్రాలు సెట్స్ పైన చిత్రీకరణ జరుపుకుంటుంటా ఉంటాయి. దీనిని బట్టే చెప్పొచ్చు సినిమాల పట్ల దిల్ రాజు ఎంత ప్యాషనేట్‌గా ఉంటారో అని. అలాగే కేవలం స్టార్ హీరోలతోనే కాకుండా కొత్తవారితో సైతం సినిమాలు తీయడానికి వెనుకాడని నైజం ఆయనను మిగతావారికి భిన్నంగా చూపుతుంది.
నటీనటులనే కాదు, దర్శకులు, టెక్నిషియన్స్.. ఎవరైనా సరే ట్యాలెంట్ ఉన్నవారికి చేయి అందించడంలో, అవకాశాలు కల్పించడంలో ముందుంటారు దిల్ రాజు. కంటెంట్ బావుంటే చాలు వారికీ అనుభవం ఉందా? లేదా? అని చూడరు. దీనికి తొలి చిత్రం దిల్ నుంచి ఇటీవలి బలగం వరకూ ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి.
దిల్ రాజు సినిమాలపై ఆసక్తితో తొలుత పంపిణీదారుడిగా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత మూవీస్ డిస్ట్రిబ్యూషన్ కొనసాగిస్తూనే నిర్మాతగా కూడా మారారు. దీనిలో భాగంగా 2003లో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌ను స్థాపించి ఇప్పటివరకూ 50కి పైగా చిత్రాలను నిర్మించడం విశేషం.
ఈ క్రమంలో అనేక విజయవంతమైన చిత్రాలను నిర్మించారు. ఇక తాను నిర్మించిన మొదటి చిత్రం ‘దిల్’ బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో ‘దిల్’ ఆయన ఇంటిపేరుగా మారిపోయింది. దీంతో అప్పటినుంచి ఆయన దిల్ రాజు గా పాపులర్ అయ్యారు. కాగా గతేడాది తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలికి జరిగిన ఎన్నికల్లో ఘనవిజయం సాధించి తెలుగు ఫిలిం ఛాంబర్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.
మరోవైపు తాజాగా దిల్ రాజును తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ (టీఎఫ్‌డీసీ)గా తాజాగా నియమించిన సంగతి తెలిసిందే. ఈ పదవిలో దిల్ రాజు రెండేళ్లపాటు కొనసాగనున్నారు. ప్రభుత్వంలోని సినిమాటోగ్రఫీ మంత్రిత్వ శాఖతో కలిసి తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ పనిచేయనుంది. త్వరలోనే ఆయన ఈ పదవీబాధ్యతలు చేపట్టనున్నారు.
ఇక వచ్చే ఏడాది సంక్రాంతి పండుగ సందర్భంగా ఆయన నిర్మించిన రెండు భారీ చిత్రాలు (గేమ్ ఛేంజర్, సంక్రాంతికి వస్తున్నాం) స్వల్ప వ్యవధిలో రిలీజ్ కానుండటం విశేషం. అలాగే స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తోన్న ‘డాకు మహారాజ్’ సినిమాను కూడా ఇదే సమయంలో రాజు గారు విడుదల చేస్తున్నారు. ఇలా నాలుగు రోజుల వ్యవధిలో మూడు మరో పెద్ద చిత్రాలను ఆయన ప్రేక్షకులకు అందిస్తున్నారు.
ఇలా ఒక నిర్మాత ఏకకాలంలో ఇన్ని భారీ బడ్జెట్ చిత్రాలను నిర్మించడం, డిస్ట్రిబ్యూట్ చేయడం అంటే మాటలు కాదు. అది కూడా తాను నిర్మించిన రెండు సినిమాలను ఒకేసారి విడుదల చేయడం అంటే.. ఎన్నో గట్స్ కావాలి, ఎంతో కమిట్‌మెంట్, ప్యాషన్ ఉండాలి. అవి ఆయనలో పుష్కలంగా ఉన్నాయి. అందుకే ఇన్ని ప్రత్యేకతలున్న ప్రొడ్యూసర్ దిల్ రాజు తెలుగు చిత్ర పరిశ్రమలో నిజమైన గేమ్ ఛేంజర్ అని చెప్పొచ్చు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: