ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్, బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న మచ్ అవైటెడ్ ఫిల్మ్ ‘పుష్ప 2: ది రూల్’. ఇంతకుముందు వీరి కాంబోలోనే వచ్చిన ‘పుష్ప: ది రైజ్’ చిత్రానికి సీక్వెల్‌గా ఇది రూపొందుతోంది. రష్మిక మందన్నా కథానాయికగా నటిస్తుండగా.. ప్రముఖ మలయాళ నటుడు ఫహద్ ఫాసిల్ కీలక పాత్రను పోషిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజ్ చేసిన ప్రమోషనల్ కంటెంట్ హ్యూజ్ బజ్ క్రియేట్ చేసింది. ఇటీవలే బీహార్ రాజధాని పాట్నాలో పుష్ప 2 ట్రైలర్ లాంచ్ చేయగా యూట్యూబ్‌లో సెన్సేషన్ వ్యూస్‌తో దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో ‘కిస్సిక్’ అనే స్పెషల్ సాంగ్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ పాటకు రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ అదిరిపోయే బీట్ ఇచ్చారు. రకీబ్ ఆలం సాహిత్యం అందించగా, గాయకులు లోతిక మరియు సుబ్లాషిణి ఆలపించారు.
డ్యాన్సింగ్ క్వీన్ శ్రీలీల ఇందులో ఐకాన్ స్టార్ సరసన కాలు కదపడం విశేషం. డ్యాన్స్ చేయడంలో శ్రీలీల ట్యాలెంట్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కరలేదు. బన్నీ సంగతి సరే సరి.. ఆయనకు ఆయనే సాటి. బాలీవుడ్ స్టార్ డ్యాన్స్ మాస్టర్ గణేష్ ఆచార్య నృత్య రీతులు సమకూర్చారు. ఆయన ఆధ్వర్యంలో ఈ జంట అదిరిపోయే స్టెప్పులేసింది. రేపు థియేటర్లలో ఈ జంట డ్యాన్స్‌ను చూసి ఇప్పుడు అల్లు అర్జున్ అభిమానులు సహా మూవీ లవర్స్ ఎంజాయ్ చేయడం పక్కా.
ఇక పుష్ప 2: ది రూల్ చిత్రాన్ని సుకుమార్ రైటింగ్స్ అసోసియేషన్‌తో టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌజ్ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మాతలు నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాలో టాలీవుడ్ సీనియర్ నటులు జగపతి బాబు, రాజేంద్ర ప్రసాద్, సునీల్, రావు రమేష్, అనసూయ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా 12,000 స్క్రీన్స్‌లో విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో పుష్ప 2 ప్రీ-సేల్స్‌లో రికార్డ్ సృష్టిస్తోంది. అమెరికాలో ఇప్పటికే ప్రీ-సేల్స్ బుకింగ్స్ ఓపెన్ చేయగా.. 1మిలియన్ డాలర్స్‌కు పైగా వసూళ్లు సాధించి అతి తక్కువ సమయంలో ఈ మార్క్ అందుకున్న తొలి భారతీయ చిత్రంగా నిలిచి రికార్డ్ నెలకొల్పింది. కాగా అమెరికా వ్యాప్తంగా మొత్తం 3,230 షోలను ప్రదర్శించనున్నారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: