టాలీవుడ్ టాలెంటెడ్ హీరో సత్యదేవ్, కన్నడ స్టార్ డాలీ ధనంజయ హైలీ యాంటిసిపేటెడ్ మల్టీ స్టారర్ ‘జీబ్రా’. ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని పద్మజ ఫిలింస్ ప్రైవేట్ లిమిటెడ్, ఓల్డ్ టౌన్ పిక్చర్స్ బ్యానర్‌పై ఎస్‌ఎన్ రెడ్డి, ఎస్ పద్మజ, బాల సుందరం, దినేష్ సుందరం నిర్మిస్తున్నారు. జీబ్రా మూవీ నవంబర్ 22న థియేటర్లలోకి రానుంది. తాజాగా ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను మెగాస్టార్ చిరంజీవి లాంచ్ చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు ఈశ్వర్ కార్తీక్ జీబ్రా గురించి పలు ఆసక్తికర విశేషాలు వివరించారు. ఈశ్వర్ కార్తీక్ ఏమన్నారో ఆయన మాటల్లోనే.. “చిరంజీవి గారి జగదీక వీరుడు అతిలోకసుందరి, రుద్రవీణ.. ఈ రెండు సినిమాలన్నీ డిఫరెంట్ ఏజెస్ లో చూశాను. ఈ రెండు సినిమాలు కూడా నాకు డిఫరెంట్ గా ఇంపాక్ట్ చేశాయి. అప్పుడే సినిమా పవర్, యాక్టింగ్ పవర్ తెలిసింది. చిరంజీవి గారు ఈ వేడుకకు రావడం చాలా ఆనందంగా వుంది.”
“ఇంత యూనిక్ స్టొరీ ని నమ్మి ప్రొడ్యూస్ చేసిన నిర్మాతలకు థాంక్యూ సో మచ్. సత్య ఎంతగానో సపోర్ట్ చేశారు. సత్య కారణంగా డాలీ అనే మరో ఫ్రెండ్ దొరికారు. ఇద్దరూ అద్భుతంగా చేశారు. ఈ సినిమాలో పనిచేసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. ఆడియన్స్ ని మా మైండ్లో పెట్టుకుని రాసిన కథ ఇది. ఆడియన్స్ ఇచ్చిన సలహాలు, సూచనలే నన్ను డైరెక్టర్ గా తీర్చిదిద్దుతాయి. ఆడియన్స్ కి చాలా మంచి ప్రోడక్ట్ ని అందిస్తున్నామని నమ్మకం ఉంది.”
“ఫస్ట్ ప్రైమ్ నుంచి చివరి వరకు ఈ సినిమా ఒక రోలర్ కోస్టర్ రైడ్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. సినిమా అంతా చాలా ఎంగేజింగ్ ఉంటుంది. లాస్ట్ 40 మినిట్స్ సీట్ ఎడ్జ్ లో ఉంటారు. అది మాత్రం చాలా నమ్మకంగా చెప్తున్నాను. మీ అందరి సపోర్టు కావాలి. అందరూ సపోర్ట్ చేస్తారని నమ్మకం మాకుంది. అందరికీ థాంక్యూ” అని అన్నారు దర్శకుడు ఈశ్వర్ కార్తీక్.
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్‌ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























