పుష్ప 2 ఆల్ టైం రికార్డ్

Pushpa 2 The Rule creates all time record in pre release business

మచ్ అవైటెడ్ సీక్వెల్ పుష్ప 2 ది రూల్ మ్యానియా స్టార్ట్ అయ్యింది. తెలుగు నుండి ఈ ఏడాది చివర్లో చివరగా వస్తున్న పెద్ద సినిమా ఇదే. ఈసినిమాపై తెలుగులోనే కాదు దేశ వ్యాప్తంగా ఈసినిమాపై భారీ అంచనాలు వున్నాయి.పుష్ప ఫస్ట్ పార్ట్ సెన్సేషన్ క్రియేట్ చేయడం తో పుష్ప 2 ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్నారు సినీ లవర్స్.ఇప్పటివరకు రిలీజ్ చేసిన ప్రమోషనల్ కంటెంట్ కూడా ఎక్కడా నిరాశపర్చలేదు.ఇక ప్రీ బిజినెస్ పరంగా పుష్ప 2 సరికొత్త రికార్డు సృష్టించింది.థియేట్రికల్ ,నాన్ థియేట్రికల్ కలుపుకొని మొత్తం 1000 కోట్లకు పైగా బిజినెస్ చేసింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

నాన్ థియేట్రికల్ రూపంలో 420కోట్ల బిజినెస్ చేసినట్లు నిర్మాతలు ప్రకటించారు.ఇప్పటివరకు ఇదే హైయెస్ట్.థియేట్రికల్ రూపంలో మరో 600కోట్లకు పైగా బిజినెస్ జరిగింది. దాంతో 1000కోట్లకు పైగా బిజినెస్ చేసిన మొదటి ఇండియన్ సినిమాగా పుష్ప 2 ఆల్ టైం రికార్డు క్రియేట్ చేసింది.బ్రేక్ ఈవెన్ కావాలంటే 1000 కోట్లకు పైనే రాబట్టాల్సివుంటుంది.వున్న హైప్ కు బ్లాక్ బాస్టర్ టాక్ వస్తే టార్గెట్ అంత కష్టమేమి కాకపోవచ్చు.

ఇక ఈసినిమా షూటింగ్ కూడా తుది దశకు చేరుకుంది.నవంబర్ మొదటి వారం లో షూటింగ్ కంప్లీట్ కానుంది.అల్లు అర్జున్ టైటిల్ రోల్ లో నటిస్తున్న ఈసినిమాకు సుకుమార్ దర్శకత్వం వహిస్తుండగా రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.మైత్రి మూవీ మేకర్స్ ,సుకుమార్ రైటింగ్స్ నిర్మిస్తున్నాయి.రిలీజ్ డేట్ కూడా ఓ రోజు ముందుకు జరిగింది.డిసెంబర్ 5నే ఈసినిమా థియేటర్లలోకి రానుంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.