మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘మట్కా’ రిలీజ్‌కు రెడీగా వుంది. వైర ఎంటర్‌టైన్‌మెంట్స్, SRT ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల, రజనీ తాళ్లూరి నిర్మిస్తున్న ఈ చిత్రానికి కరుణ కుమార్ దర్శకత్వం వహించారు. వరుణ్ తేజ్ మట్కా వాసు అనే పాత్రలో కనిపించనున్నారు. కాగా నవంబర్ 14న ఈ సినిమా గ్రాండ్‌గా విడుదల కానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ నేపథ్యంలో మేకర్స్ మట్కా ప్రమోషన్స్ ముమ్మురం చేసారు. దీనిలో భాగంగా ఫస్ట్ సింగిల్ ‘లే లే రాజా’ చార్ట్ బస్టర్ రెస్పాన్స్‌తో మ్యూజికల్ ప్రమోషన్స్ స్టార్ట్ అయ్యాయి. అలాగే ఇటీవలే 25 డేస్ కౌంట్‌డౌన్ పోస్టర్‌ని రిలీజ్ చేశారు. ఈ క్రమంలో తాజాగా ఈ మూవీ నుంచి సెకండ్ సింగిల్ రిలీజ్ చేసారు మేకర్స్. ‘తస్సాదియ్యా’ అంటూ సాగే ఈ పాటకు భాస్కరభట్ల రవికుమార్ సాహిత్యం అందించగా, సీనియర్ గాయకుడు మనో గాత్రం అందించారు.
కాగా వరుణ్ తేజ్ కెరీర్‌లో మట్కా మోస్ట్ ఎక్స్ పెన్సీవ్ మూవీగా తెరకెక్కుతోంది. మీనాక్షి చౌదరి, నోరా ఫతేహి హీరోయిన్స్‌గా నటిస్తుండగా.. నవీన్ చంద్ర, అజయ్ ఘోష్, కన్నడ కిషోర్, రవీంద్ర విజయ్, పి రవి శంకర్, తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇక ఈ చిత్రానికి సంగీతం జివి ప్రకాష్ కుమార్ అందించగా, ఎ కిషోర్ కుమార్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. కార్తీక శ్రీనివాస్ ఆర్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























