తెలుగమ్మాయి అనన్య నాగళ్ల మరియు యంగ్ అండ్ ట్యాలెంటెడ్ హీరో యువ చంద్ర కృష్ణ లీడ్ రోల్స్‌లో నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘పొట్టేల్’. సాహిత్ మోత్ఖూరి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అజయ్ కీలక పాత్రలో కనిపించనుండగా.. ప్రియాంక శర్మ, తనస్వి చౌదరి, నోయల్ సీన్, చత్రపతి శేఖర్, శ్రీకాంత్ అయ్యంగార్, జీవన్, రియాజ్, విక్రమ్ తదితరులు నటిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఎన్ఐఎస్ఏ ఎంటర్‌టైనర్‌మెంట్ బ్యానర్‌పై నిశాంక్ రెడ్డి కుడితి, ప్రగ్యా సన్నిది క్రియేషన్స్ బ్యానర్‌పై సురేష్ కుమార్ సడిగే సంయుక్తంగా నిర్మించారు. కంప్లీట్ రూరల్ బ్యాక్ డ్రాప్‌లో ఫ్రెష్ అండ్ హానెస్ట్ నొవల్ కాన్సెప్ట్ చిత్రంగా తెరకెక్కిన పొట్టేల్ అక్టోబర్ 25న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం మూవీ ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తోంది.
దీనిలో భాగంగా ఈరోజు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఆయన పెద్దనాన్న, దివంగత సీనియర్ నటుడు, రెబల్ స్టార్ కృష్ణంరాజు ఇంటికి వెళ్ళింది చిత్ర యూనిట్. ఈ మేరకు హీరోయిన్ అనన్య నాగళ్ల, యువ చంద్ర, అనన్యనాగళ్ల, నోయెల్ కలిసి సినిమాలో నటించిన పొట్టేల్‌ను తీసుకొని కృష్ణంరాజు ఇంటికెళ్లారు.
ఈ క్రమంలో ఇంటిగుమ్మం వద్ద ఏర్పాటుచేసిన కృష్ణంరాజు గారి విగ్రహం వద్ద పొట్టేల్ టీమ్ ఆశీస్సులు తీసుకుంది. ఇక ఈ సందర్భంగా కృష్ణంరాజు సతీమణి,ప్రభాస్ పెద్దమ్మ శ్యామలాదేవి పొట్టేల్ సినిమా ఘనవిజయం సాధించాలని చిత్ర బృందానికి విషెస్ తెలిపారు. కాగా ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























