సత్యం సుందరం.. ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్

Sathyam Sundaram OTT Platform and Release Date Announced

కోలీవుడ్ స్టార్ హీరో కార్తి, సీనియర్ నటుడు అరవింద్ స్వామి ప్రధానపాత్రల్లో నటించిన తాజా చిత్రం ‘సత్యం సుందరం’. ’96’ ఫేమ్ ప్రేమ్ కుమార్ దర్శకత్వం వహించగా.. శ్రీ దివ్య కీలక పాత్ర పోషించింది. ఫీల్ గుడ్ మూవీగా తెరకెక్కిన ఈ సినిమా సెప్టెంబర్ 28న విడుదలై థియేటర్లలో ప్రేక్షకులను అలరించింది. ఈ చిత్రాన్ని చూస్తుంటే ఒక మంచి నవల చదివిన అనుభూతినిస్తుందని విడుదల సమయంలో హీరో కార్తి చెప్పిన మాట నిజమని చూసిన ప్రతిఒక్కరూ అభిప్రాయపడ్డారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

రెగ్యులర్ ఫార్మాట్‌లో కాకుండా, స్లో నేరేషన్‌తో సాగే ఈ చిత్రంలో ఆస్తులు, అంతస్తులకంటే కుటుంబం, బంధుత్వాలు, అనుబంధాలు ముఖ్యమనే థీమ్‌తో దర్శకుడు దీనిని రూపొందించడం విశేషం. ఈమధ్య కాలంలో వచ్చినవాటిలో ఇది అద్భుతమైన సినిమా ఆడియెన్స్ నుంచి కితాబులందుకుంది. దీంతో ఈ చిత్రం డిజిటల్ స్ట్రీమింగ్ కోసం మూవీ లవర్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఈ నేపథ్యంలో సత్యం సుందరం ఓటీటీ అప్‌డేట్‌ వచ్చింది. త్వరలో ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ వేదికగా ఇది స్ట్రీమింగ్ కానుంది. అక్టోబర్ 25 నుంచి ఈ మూవీ మాతృక తమిళం సహా తెలుగు, కన్నడ, మలయాళం మరియు హిందీ భాషల్లో ఇది అందుబాటులో ఉండనుంది. ఈమేరకు నెట్‌ఫ్లిక్స్ సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించింది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.